ఆసియాకప్ ఫైనల్లో లంక బౌలర్ చెత్త రికార్డు

ఆసియాకప్ ఫైనల్లో లంక బౌలర్ చెత్త రికార్డు

ఆసియాకప్ 2022లో శ్రీలంక బౌలర్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఫైనల్లో లంక బౌలర్ దిల్షాన్ మధుశంకా..ఒక్క లీగల్ డెలివరీ వేయకుండానే 9 పరుగులిచ్చుకున్నాడు.  టీ20ల్లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చెత్త బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా మధుశంకా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 

ఒక్క బంతికి 10 రన్స్..
ఫస్ట్బాల్ను మధుశంకా ఫ్రంట్ఫుట్ నోబాల్‌గా వేశాడు. అయితే ఫ్రీ హిట్‌ను బ్యాట్స్ మన్ కొట్టకూడదన్న ఉద్దేశంతో బౌన్సర్ సంధించాడు. కానీ అది కాస్త బ్యాట్స్ మన్ తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ తర్వాత లెగ్ స్టంప్ టార్గెట్‌గా వరుసగా మూడు వైడ్స్ వేశాడు. ఇందులో ఒకటి వికెట్ కీపర్‌ను మిస్సై బౌండరీకి వెళ్లింది. దాంతో ఒక్క లీగల్ డెలివరీ పడకుండానే పాక్ ఖాతాలో 9 పరుగులు చేరాయి. అనంతర ఎట్టకేలకు లీగల్ డెలివరీ వేయగా సింగిల్ వచ్చింది. దాంతో ఒక్క బంతికే పాక్ 10 పరుగులు పిండుకుంది.

నెటిజన్ల ఆగ్రహం..
ఆ తర్వాత మిగతా ఐదు బంతులకు రెండే పరుగులు ఇచ్చాడు. దీంతో మొత్తంగా ఓవర్ లో 12 పరుగులు సమర్పించుకున్నాడు. మధుశంకా వైడ్లు, నోబాల్స్ వేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మ్యాచ్ ఘనంగా ప్రారంభించిన శ్రీలంకకు..మధుశంకా... పేలవ ఆరంభాన్ని అందించాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.