వేసవి సెలవుల రోజులలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది. శ్రీ స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు అధికారులు నిలుపుదల చేశారు.
శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది ఉచిత, శీఘ్ర,అతిశీఘ్ర, దర్శన క్యూలైన్ల ద్వారా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆన్ లైన్ లో స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేస్తున్న భక్తులను 2 విడతలుగా అనుమతి ఇస్తున్నారు.
