ఇండోసోల్ నుంచి సోలార్ మాడ్యూల్స్​

ఇండోసోల్ నుంచి సోలార్ మాడ్యూల్స్​

హైదరాబాద్, వెలుగు: - షిర్డీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్​ఎస్​ఈఎల్​) అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరుజిల్లా రామాయపట్నం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటీలో ఈ నెల 31 నుంచి సోలార్ మాడ్యూల్ తయారీ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 2024 జనవరిలో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలంలో ఈ ప్రొడక్షన్​ లైన్​ను నిర్మించారు.

మొదటిదశను 500 మెగావాట్లతో మొదలుపెడతామని ఎస్​ఎస్​ఈఎల్​ సీఈఓ శరత్​చంద్ర చెప్పారు.  ఇందుకోసం రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్​ చేయనున్నట్టు వెల్లడించారు. మిగతా రెండుదశలో కోసం మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఫలితంగా 23 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.