
భారీ వరదల కారణంగా నష్టపోయిన బాధితుల్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వరదసాయాన్ని ప్రకటించింది. అయితే ఈ వరద సాయం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఎస్ ఈసీ సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్వర్వుల్లో పేర్కొంది.
వరద సాయంపై పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని…వరద సాయం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయా పార్టీ నేతలు చెప్పడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.