డెక్సా మెథాసోన్ తో తగ్గిన కరోనా మరణాలు

డెక్సా మెథాసోన్ తో తగ్గిన కరోనా మరణాలు
  • వెంటిలేటర్ పేషెంట్లలో 33%.. ఆక్సిజన్ పేషెంట్లలో 20% తగ్గుదల
  •  డెక్సా మెథాసోన్ పై ఆక్స్ ఫర్డ్ సైంటిస్టుల ట్రయల్స్ సక్సెస్

మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ , యాంటీ వైరల్ రెమ్డెసివిర్, ఫావిపిరావిర్, హెచ్ఐవీ మందు లొపినావిర్.. ఒక్కటేంటి కరోనా వచ్చినప్పటి నుంచి దానిని నయం చేసే మందులు, వ్యాక్సిన్ల పై సైంటిస్టులు స్టడీలు చేస్తూనే ఉన్నారు. క్లోరోక్విన్ గురించి ఎంత పెద్దచర్చ నడిచిందో చెప్పనవసరమే లేదు. ఇప్పుడు ఆ మందుల జాబితాలో ఇంకోటి వచ్చి చేరింది. దాని పేరు డెక్సామెథాసోన్ . సింపుల్గా ‘డెక్సా’ అని కూడా పిలుస్తుంటారు. కరోనా పేషెంట్ల మరణాలను చాలా వరకు డెక్సా తగించిందట. బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది.

మరణాలను తగ్గించింది…

డెక్సామెథాసోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు 175 ఎన్ హెచ్ఎస్ ఆస్పత్రుల్లో చేరిన 11,500 మంది పేషెంట్లను ఎంచుకున్నారు. అందులో 2,104 మంది పేషెంట్లను ర్యాండమ్ గా ఎంపిక చేసి డెక్సాను ఇచ్చారు. మరో 4,321 మంది పేషెంట్లకు ఆ మందు లేకుండానే మామూలు ట్రీట్ మెంట్ ఇచ్చారు. పేషెంట్లకు పది రోజుల పాటు రోజూ 6 మిల్లీ గ్రాముల చొప్పున డెక్సా మందును ఇచ్చారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లలో 33 శాతం వరకు డెత్స్  ను డెక్సా తగ్గించగలిగిందని సైంటిస్టులు గుర్తించారు. అదే మామూలు ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లలో 20 శాతం వరకు మరణాలను తగించినట్టు తేల్చారు. సీరియస్ గా లేని పేషెంట్లలో మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లు కనిపించలేదని గుర్తించారు. ‘‘కరోనా మరణాలను తగ్గిస్తుందని ప్రూవ్ చేసిన మొదటి మందు డెక్సామెథాసోన్. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన పేషెంట్లకు ఇది బాగా పనిచేస్తుందని క్లియర్ గా తేలింది. కాబట్టి ఆరోగ్యం క్రిటికట్ గా ఉన్న వాళ్లకు దీనిని స్టాండర్డ్ మందుగా వాడొచ్చు. పైగా దీని ధర కూడా చాలా తక్కువ’’ అని ఈ ట్రయల్ లీడ్ చేసిన ప్రొఫెసర్ పీటర్ హోర్బీ సూచించారు.

 ఏంటీ మందు?

డెక్సామెథాసోన్.. కార్డికోస్టీరాయిడ్ గ్రూప్ కు చెందిన మందు. అడ్రినల్ కార్టెక్స్ లో తయారయ్యే స్టీరాయిడ్ హార్మోన్లే ఈ కార్టికోర్టిస్టీరాయిడ్స్. చర్మసమస్యలు, అలర్జీ లు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడువాపు, కళ్ల సర్జరీ, ప్రెగ్నెన్సీలో దీనిని వాడుతుంటారు. క్షయ (టీబీ)కి యాంటీ బయాటిక్స్ తో కలిపి దీనిని ఇస్తారు. కేన్సర్ కీమోథెరపీలో సైడ్ఎఫెక్స్ ట్ను తగించేందుకూ దీనిని ఇస్తారు. పర్వతాలు ఎక్కేటప్పుడు మౌంటెనీర్స్ ఈ మందును తీసుకెళ్తారు.