ఈ వారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

ఈ వారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

న్యూఢిల్లీ: దేశ స్టాక్ మార్కెట్‌‌లు ఈ వారం లాభాల్లో ముగిశాయి. గత మూడు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 6.30 లక్షల కోట్లు పెరిగింది. గ్లోబల్‌‌ మార్కెట్‌‌ల నుంచి సపోర్ట్ దొరకడంతో ఈ వారంలో చివరి సెషన్ అయిన శుక్రవారం కూడా సెన్సెక్స్‌‌, నిఫ్టీలు పాజిటివ్‌‌గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌‌ 303 పాయింట్లు (0.56 %)పెరిగి 54, 482 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 16,221 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌‌లో లార్సెన్ అండ్ టూబ్రో షేరు (5% అప్‌‌) ఎక్కువగా లాభపడింది. కమోడిటీ రేట్లు తగ్గుతుండడంతో  ఇన్‌‌ఫ్లేషన్ దిగొస్తుందనే అంచనాల మధ్య మార్కెట్‌‌లు పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇన్‌‌ఫ్లేషన్ తగ్గితే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను కొంత నెమ్మదిగా పెంచుతాయనే అభిప్రాయపడ్డారు. వారం ప్రాతిపదికన చూస్తే,  సెన్సెక్స్ ఈ వారం 1,574 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 469 పాయింట్లు పెరిగింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు తగ్గి 79.23 వద్ద సెటిలయ్యింది.