వజ్రాసనంతో స్ట్రెస్ మాయం

వజ్రాసనంతో స్ట్రెస్ మాయం

కండరాలు పట్టేసినప్పుడు కాసేపు వజ్రాసనంలో ఉంటే రిలీఫ్​గా​ అనిపిస్తుంది. జీవక్రియలు వేగంగా జరగడానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది. అయితే వజ్రాసనంలో ఐదు నిమిషాలు ఉండడం కూడా కొందరికి కష్టమవుతుంది. అలా అనిపించడానికి కారణాలతో పాటు వాటికి సొల్యూషన్ కూడా చెబుతున్నారు యోగా ఎక్స్​పర్ట్ అక్షర్​. 

వజ్రాసనంలో ఓ రెండు నిమిషాలు ఉన్నారో లేదో కొందరికి కాళ్లు తిమ్మిర్లు పడతాయి.  కాలి మడిమ బెణుకుతుంది.  ఇలా ఎందుకు జరుగుతుందంటే.... 
తినేటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా కుర్చీలు, సోఫాల మీద కూర్చోవడానికి అలవాటు పడిపోయారంతా.  నేలపై బాసింపట్టు వేసుకుని కూర్చోవడం బాగా తగ్గిపోయింది. లైఫ్​స్టయిల్లో మార్పులు​, కొత్త అలవాట్ల కారణంగా మోకాళ్లు, కాలి మడిమలు బలంగా ఉండవు.  దాంతో,  వజ్రాసనంలో కూర్చోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది.
మోకాళ్లు, మోకాలి మడమలకి గాయాలు అయిన వాళ్లు వజ్రాసనంలో ఎక్కువ సేపు ఉండలేరు. 
మోకాళ్లు, కాలి పిక్కదగ్గరి  కండరాలు  ఫ్లెక్సిబుల్​గా లేకపోవడం వల్ల కూడా వజ్రాసనం వేయడం కష్టమవుతుంది. 
ఒబెసిటీ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ టైం వజ్రాసనంలో ఉండలేరు. వీళ్లకి శరీర బరువుని మోకాళ్ల మీద బ్యాలెన్స్​ చేయడం సవాల్​. 
కండరాలు ఫ్లెక్సిబుల్​గా లేకుంటే రక్తప్రసరణ సరిగా జరగక కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.

ఇలా చేస్తే బెటర్
ఎక్కువ సేపు కూర్చొని లేచిన ప్రతిసారి  స్ట్రెచింగ్​ చేయాలి. కాలి కండరాలు గట్టిపడేందుకు వాకింగ్, జాగింగ్​, సైకిల్​ తొక్కడం, మెట్లు ఎక్కడం వంటి ఎక్సర్​సైజ్​లు​ చేయాలి. వజ్రాసనంలో 30 సెకన్లు ఉండాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయాలి. తర్వాత కంఫర్ట్​ని బట్టి  టైం పెంచుతూ పోవాలి. 
నేలపై వజ్రాసనం వేయడం కష్టంగా ఉంటే మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి.
బాలాసనం​, పాదంగస్తాసనం, సేతుబంధాసనం, కపోతాసనం, ఆంజనేయాసనం ​వంటివి 15–20 సెకన్లు ప్రాక్టీస్​ చేస్తే వజ్రాసనం వేయడం ఈజీ అవుతుంది.

వజ్రాసనం వేస్తే...
స్ట్రెస్​ తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అసిడిటీతో పాటు  పీరియడ్​ క్రాంప్స్ తగ్గిపోతాయి. బరువు తగ్గుతారు. కండరాలు పట్టేయవు. మూత్రనాళ సంబంధ సమస్యలకి మందులా పనిచేస్తుంది. వెన్నునొప్పి మాయమవుతుంది.

For More News..

చీరలు పంచితే.. కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు అడగండి

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ..