కత్రినా హల్దీ ఫొటోలు.. క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్స్

కత్రినా హల్దీ ఫొటోలు.. క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్స్

సవాయ్ మాధోపూర్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, హ్యాండ్సమ్ హంక్ విక్కీ కౌశల్ జంట ఒక్కటైంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కపుల్స్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ లోని  సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో డిసెంబర్ 9న  అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది.  అయితే పెళ్లి జరిగే వరకు దీనికి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ బయటకు రాకుండా విక్ట్రీనా జాగ్రత్తపడ్డారు. నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తం, వేడుకలు, హాల్దీ ఫంక్షన్‌, పెళ్లి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఉంచారు. అయితే తామిద్దరం ఒక్కటయ్యామంటూ తాజాగా సోషల్‌ మీడియాలో కత్రినా, విక్కీ ప్రకటించారు. హల్దీకి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలు సూపర్ అంటూ, క్యూట్ పెయిర్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)