IND vs ENG 4th Test: టీమిండియాకు నెక్స్ట్ ధోనీ దొరికేశాడు: గవాస్కర్

IND vs ENG 4th Test: టీమిండియాకు నెక్స్ట్ ధోనీ దొరికేశాడు: గవాస్కర్

టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తన తొలి టెస్ట్ సిరీస్ లోనే ఆకట్టుకున్నాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులు చేసిన ఈ యువ వికెట్ కీపర్ రాంచీ టెస్టులో కీలకమైన 90 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేస్తూ టీమిండియాను మ్యాచ్ లో నిలబెట్టాడు. టెయిలండర్ల సహకారంతో కీలకమైన 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా భారత మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్  జుర్ల్ ను ఏకంగా గవాస్కర్ తో పోల్చాడు.  

గవాస్కర్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో జురెల్ బ్యాటింగ్ చూస్తే నాకు ముచ్చటేసిందని.. అతడు ఆడుతున్న విధానం, షాట్ సెలెక్షన్,  చూస్తుంటే.. భవిష్యత్ లో టీమిండియాకు మరో ధోని అవుతాడనిపిస్తోందని.. అన్నారు. జురెల్ ఆటతీరు నేను ఎంతో ఎంజాయ్ చేశానని.. టీమిండియాకు మంచి వికెట్ కీపర్ బ్యాటర్ అవడంలో ఎలాంటి సందేహం లేదని ఈ యువ వికెట్ కీపర్ ను ఆకాశానికెత్తేసాడు. ధోనీతో పోల్చడంతో ప్రస్తుతం సునీల్ గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.   

తెలుగు వికెట్ కీపర్ భరత్ స్థానంలో వచ్చి తన స్థానాన్ని భర్తీ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ సైతం  జురెల్‌ను కొనియాడాడు. “ధృవ్ జురెల్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. అతను అద్భుతంగా ఆడాడు. తన ఆటకు భిన్నమైన కోణాన్ని చూపించాడు. అని రూట్ అన్నారు. దీంతో రిషబ్ పంత్ జట్టులో చేరేవరకు టెస్టు జట్టులో జురెల్ స్థానానికి ఎలాంటి డోకా లేదనిపిస్తుంది.