ఇన్నేళ్లుగా ఇంత ప్రేమా!! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సన్నీలియోన్

ఇన్నేళ్లుగా ఇంత ప్రేమా!! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సన్నీలియోన్

పుట్టిన రోజున ట్వీట్ లో భర్తపై ప్రేమను చెప్పిన సన్నీ

బాలీవుడ్ నటి సన్నీలియోన్ భర్త డానియేల్ వెబర్ పై తనకున్న ప్రేమనంతా ఒక్క ట్వీట్ ద్వారా ప్రపంచానికి తెలిపింది. 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్న భర్తకు శుభాకంక్షలు చెబుతూ ట్విట్టర్ లో పోస్టు చేసింది సన్నీ.

‘చాలా ఏళ్లుగా నీతో ప్రేమలో ఉన్నా.. గడిచిన కొన్నేళ్లుగా నీతో కలిసి ఉంటున్నా. ఇంత కాలం నీతోనే ఉన్నా నీ పై ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. దీన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నువ్వు చాలా ధైర్యవంతుడివి. చాలా స్మార్ట్.. స్ట్రాంగ్.. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటావు. కేరింగ్ గా ఉంటావు. మనసులో ఏ కపటం పెట్టుకోవు. చాలా గొప్ప భర్తవి. చాలా గొప్ప తండ్రివి నువ్వు. హ్యపీ బర్త్ డే మై లవ్’ అంటూ సన్నీలియోన్ ట్వీట్ చేసింది. తన భర్తపై ఉన్న ప్రేమను ఈ ఎమోషనల్ పోస్టు ద్వారా తెలిపింది.

చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న సన్నీ, వెబర్ 2011లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 2017లో వీరిద్దరూ ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆ తర్వాత ఏడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారీ జంట.

నీది చాలా విశాల హృదయం

సన్నీ పోస్టుపై భర్త వెబర్ స్పందించాడు. ముందుగా 41వ పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ‘సన్నీ నువ్వు గొప్ప భార్యవి. నీది విశాల హృదయం. థ్యాంక్ యూ!!’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు వెబర్.