బిగ్‌‌‌‌సీలో శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఏఐ ఫోన్ల సూపర్ సేల్‌‌‌‌

బిగ్‌‌‌‌సీలో శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఏఐ ఫోన్ల సూపర్ సేల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శామ్‌‌‌‌సంగ్‌‌‌‌  గెలాక్సీ ఏఐ సిరీస్ ఫోన్ల సూపర్ సేల్‌‌‌‌ను బిగ్‌‌‌‌ సీ శుక్రవారం ప్రారంభించనుంది. ఈ సిరీస్ ఫోన్ల ధరలు రూ.40 వేల నుంచి మొదలవుతాయని ఈ సంస్థ ఫౌండర్ డీ బాలు చౌదరి పేర్కొన్నారు. చాట్ అసిస్ట్‌‌‌‌, 50 ఎంపీ ఏఐ కెమెరా, ఏఐ ఎడిట్ కెమెరా, స్నాప్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ 8జెన్‌‌‌‌3 చిప్‌‌‌‌సెట్‌‌‌‌ వంటి ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని తమ అన్ని షోరూమ్‌‌‌‌లలో శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఏఐ స్మార్ట్‌‌‌‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయని బాలు చౌదరి అన్నారు.  జీరో డౌన్ పేమెంట్‌‌‌‌,   24 నెలల నో కాస్ట్ ఈఎంఐతో వీటిని కొనుక్కోవచ్చని చెప్పారు.  మొబైల్స్ కొనుగోలుపై రూ.16 వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఉంటుందని పేర్కొన్నారు.