ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీస్‌)  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ బుధవారం విచారణ జరిపింది. ఎస్సీ కులాల్లో ఒక వర్గం జనాభా ఎక్కువ ఉన్నా తగిన రిజర్వేషన్లు పొందలేకపోతోందని పిటిషనర్​తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సీజేఐ జోక్యం చేసుకొంటూ.. ఎస్సీల్లో రిజర్వేషన్ల అంశంపై ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనానికి కేసు విచారణ వేగవంతం చేయాలని సూచించలేమన్నారు.