
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీఎం స్టాలిన్ పేరును రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ఉపయోగించడాన్ని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం( ఆగస్టు 6) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం స్టాలిన్ పై ప్రత్యేకంగా విమర్శలు చేసినందుకు పిటిషనర్ అన్నా డీఎంకే ఎంపీ సీవీ షణ్ముగంను కోర్టు తీవ్రంగా మందలించింది.
బుధవారం ఈ ఉత్తర్వుతో పాటు పిటిషనర్ ఎంపీపై రూ.10లక్షల జరిమాని విధించింది. ఆ మొత్తాన్ని నిరుపేదల పథకాల ప్రయోజనం కోసం వినియోగించేలా రాష్ట్రం ప్రభుత్వం ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును జూలై 31న ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో సీఎం స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ అన్నా డీఎంకే ఎంపీ పిటిషన్ వేయగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాజీ ముఖ్యమంత్రులు లేదా జీవించి ఉన్న రాజకీయ వ్యక్తుల పేర్లను ఉపయోగించడాన్ని మద్రాసు హైకోర్టు నిషేధించింది.
►ALSO READ | విడాకుల కేసులో మహిళపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. భర్తపై అనవసరపు భారం వేయొద్దన్న జడ్జి
మద్రాసు కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. జీవించి ఉన్న వ్యక్తి పేరు, లేదా మాజీ సీఎంలు, సిద్దాంతకర్తల ఫొటోలు, పార్టీ చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండా ను ప్రభుత్వ పథకాలలో వినియోగించడాన్ని నిషేధించింది.