మీ ఫోన్ కనిపించకపోతే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. 

మీ ఫోన్ కనిపించకపోతే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. 

చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా మనిషి జీవితాన్ని ఊహించుకోవడం ఈ రోజుల్లో కష్టమే. ప్రతిఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ తప్పనిసరైపోయింది. లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్ర పోయేవరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒక రోజులో క్షణం పాటు ఫోన్ కనిపించకపోతే ఆ టెన్షన్ మాములుగా ఉండదు. ఏం చేయాలో తోచదు. మొబైల్ ఫోన్లు మనుషుల జీవితాన్ని అంతగా ప్రభావితం చేస్తున్నాయి. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని చుట్టిరావొచ్చు. అలాంటి స్మార్ట్‌ఫోన్ విషయంలో భారతీయుల్లో చాలామంది తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఫోన్ లేదనే భావన కలిగితేనే తెగ టెన్షన్ పడిపోతున్నారట.

భారత్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఒప్పో, కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్‌ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్‌ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫోన్‌ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారట. 65 శాతం మంది వినియోగదారులు ఫోన్‌ బ్యాటరీ అయిపోతుంటే మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారని సర్వేలో తేలింది. నోమోఫోబియా 31 – 40 ఏండ్ల వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆ తర్వాత 25 – 30 ఏండ్ల వయస్సు వారిలో ఉంది. 

ఇలాంటి ఆందోళన కలిగితే వారికి ఫోబియా ఉండే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. ఇప్పటికే చాలామంది భారతీయ మొబైల్ యూజర్లు ఈ ఫోబియా బారిన పడ్డారని తెలిపింది. అంటే.. భారతీయ మొబైల్ యూజర్లలో నలుగురిలో ముగ్గురిని ఈ ఫోబియా ప్రభావితం చేస్తుందని తేలింది. అంటే.. భారతీయ జనాభాలో దాదాపు 75 శాతం మందిపై ఈ ఫోబియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని రుజువైంది. 

ఈ సర్వేలో బ్యాటరీ పర్ఫార్మెన్స్ సరిగా లేనందున 60 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం చాలా కీలకమైనదిగా Oppo చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమ్యంత్ సింగ్ ఖనోరియా పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా తమ ప్రొడక్టులను తయారు చేసే విధానంలో చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు.