హాట్రిక్ డక్.. సూర్య ఖాతాలో చెత్త రికార్డు

హాట్రిక్ డక్.. సూర్య ఖాతాలో చెత్త రికార్డు

ఏ క్రికెటర్ కోరుకోని చెత్త రికార్డును టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ తన పేరిట రాసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మూడు మ్యాచులాడిన సూర్య.. అన్ని మ్యాచుల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే, ఇలా ఒక సిరీస్ లో వరుసగా డకౌట్ అయిన తొలి భారత్ బ్యాట్స్ మెగా ఓ చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. 

అయితే, వన్డేల్లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన ఆరో భారత ఆటగాడిగా సూర్య పేరు నమోదు చేసుకున్నాడు. సూర్య కంటే ముందు సచిన్‌, అనిల్‌ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్‌ ఖాన్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. వన్డేల్లో ఎక్కువసార్లు డక్‌ ఔట్ అయిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్‌ లసిత్ మలింగ పేరిట ఉంది. మలింగ వరుసగా నాలుగుసార్లు ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. 

మొదటి రెండు మ్యాచుల్లో సూర్య.. మిచెట్ స్టార్క్ బౌలింగ్ లో ఒకే బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. చివరి మ్యాచులో అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశ పరిచాడు. ఈ మ్యాచులో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.