
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ పై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుంది. సుశాంత్ మరణంపై రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ ను మూడురోజులగా 10గంటల పాటు నిర్విరామంగా విడివిడిగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తమదగ్గరున్న స్టేట్మెంట్లతో రియా, షోయిక్ తో పాటు సుశాంత్ మరణించిన జూన్ 14న అతని ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పిథాని, నీరజ్, కేశవ్ మరియు దీపేశ్ సావంత్, సుశాంత్ అకౌంటెంట్ మేనేజర్ రజత్ లు చెప్పే మాటలు నిజమా కాదా అనే అంశంపై ప్రశ్నిస్తున్నారు.
వయసు రిత్యా సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీబీఐ అధికారులు విచారిస్తున్న వారిలో సుశాంత్ కుటుంబసభ్యులున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అక్కాచెల్లెలు ప్రియాంక సింగ్, మీటూ సింగ్, ప్రియాంక భర్త సిద్ధార్ధ్ లను కూడా ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించింది.
సుశాంత్ సోదరి మీతు సింగ్ జూన్ 8 నుండి జూన్ 12 వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తోనే ఉన్నారు. ఆ సమయంలో ఏమి జరిగిందో ఆమెను విచారించనున్నారు.