
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. సుశాంత్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఎవరో తనకు తెలియదని కూపర్ ఆస్పత్రి అంబులెన్స్ కో ఆర్డినేటర్ అన్నాడు. అంతేకాదు ఈ విషయంలో తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఇండియా టుడే కి చెప్పాడు.
సుశాంత్ సింగ్ ఇంటికి రెండు అంబులెన్స్ లు ఎందుకు వచ్చాయని ఇండియా టుడే ఫస్ట్ అంబులెన్స్ డ్రైవర్ సాహిల్ ను ప్రశ్నించగా మొదటి అంబులెన్స్ స్ట్రెచ్చర్ వీల్ ఇరిగిందని, అందుకే రెండో అంబులెన్స్ తెచ్చినట్లు చెప్పాడు.
రెండో అంబులెన్స్ డ్రైవర్ అక్షయ్..ఇండియా టుడేతో మాట్లాడుతూ తనకు పోలీసులు ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకొచ్చానని, మొదటి అంబులెన్స్ స్ట్రెచ్చర్ వీల్ ఇరిగిపోతే తాను రెండో అంబులెన్స్ తెచ్చినట్లు తెలిపాడు. తాను సుశాంత్ డెడ్ బాడీ ఉన్న గదికి వెళ్లానని, పోలీసులు వచ్చిన వెంటనే తన సహచరుడితో కలిసి సుశాంత్ డెడ్ బాడీని అంబులెన్స్ లోకి ఎక్కించినట్లు చెప్పాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రెండు రోజుల తరువాత అంబులెన్స్ డ్రైవర్ అక్షయ్ ను పోలీసులు విచారించారు. విచారణలో సందీప్ ఎస్ సింగ్ (సుశాంత్ ఫ్రెండ్, మేనేజర్) తో తనకున్న సంబంధం గురించి అక్షయ్‌ను అడగ్గా అతను ఎవరో తనకు తెలియదని అంబులెన్స్ బిల్ పే చేసేందుకు తనను పిలిచాడని, డబ్బులు చెల్లించి రిసిప్ట్ తీసుకున్నాడని అన్నాడు.