నొప్పి తెలియ‌కుండా ఎలా చ‌నిపోవాలి : గుగూల్ లో వెతికిన సుశాంత్

నొప్పి తెలియ‌కుండా ఎలా చ‌నిపోవాలి :  గుగూల్ లో వెతికిన సుశాంత్

సుశాంత్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ కేసు విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. మిస్ట‌రీ కేసును ఛేదించేందుకు బీహార్ పోలీసులు, ముంబై పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు. ఈ విచార‌ణ‌లో భాగంగా మీడియా తో ముంబై పోలీస్ క‌మీష‌నర్ పరం బీర్ సింగ్ మాట్లాడుతూ సుశాంత్ త‌న మాజీ మేనేజ‌ర్ దిశా సాలియ‌న్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయార‌న్నారు. దిశా మ‌ర‌ణంలో త‌న పేరు ప్ర‌స్తావించ‌డాన్ని త‌ట్టుకోలేని సుశాంత్ ఆందోళ‌న‌కు గుర‌య్యార‌ని చెప్పారు. ,

దిశా సాలియన్ మృతి చెందిన ఐదురోజుల త‌రువాత సుశాంత్ అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. అయితే మ‌ర‌ణానికి ముందురోజుల్లో త‌న గురించి, దిశా సాలియ‌న్ గురించి వ‌చ్చిన క‌థ‌నాల్ని చ‌దివార‌ని ముంబై సీపీ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

దీంతో పాటు స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ , నొప్పి తెలియ‌కుండా ఎలా చ‌నిపోవాలో గూగుల్ లో సెర్చ్ చేశార‌ని తెలిపారు.

అయితే సుశాంత్ కేసులో బీహార్ పోలీసులు ముంబైలో విచార‌ణ చేప‌ట్ట‌డాన్ని ఎందుకు తిర‌స్క‌రించార‌న్న మీడియా ప్ర‌శ్న‌ల‌కు ముంబై సీపీ ప‌రం బీర్ సింగ్ స్పందించారు. బీహార్ పోలీసులు సుశాంత్ కేసును ముంబైలో విచార‌ణ చేప‌ట్టే అధికారం లేద‌ని, న్యాయప‌ర‌మైన స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని, న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

స్కిజో ఫ్రెనియా అంటే ఏమిటీ..?

స్కిజో ఫ్రెనియా అంటే అంటే మెంట‌ల్ హెల్త్ కండీష‌న్ స‌మ‌స్య‌ తీవ్రంగా ఉండ‌డం, ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు త‌మ‌ని ఎవ‌రో ఏదో చేస్తున్నార‌ని, త‌మ గురించే మాట్లాడుకుంటున్నార‌ని ఇలా ఊహించుకోవడాన్ని స్కిజోఫ్రెనియా అంటారు.

బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటీ..?

సినిమాల్లోనైనా అందరూ రోలర్‌ కోస్టర్ ను చూసే ఉంటారు కదా. దాని మీదికెక్కిన వారు అకస్మాత్తుగా పైపైకి వెళ్తుంటారు. అంతలోనే లోయలోకి దూకినట్టుగా కిందికి వేగంగా దిగిపోతుంటారు. ఒక చోట గిరా గిరా గిరా గిరికీలు కొడతారు. బైపోలార్ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్‌ కాస్తా రోలర్‌ కోస్టర్‌ ఎక్కి… అవి గబగబా మారిపోతే… మనిషి గింగిరాలు తిరుగుతాడు. అలా మూడ్స్‌ మాటిమాటికీ మారిపోతున్నప్పుడు ఆ మనిషి కాసేపు అపరిమితమైన సంతోషాలూ, అంతులేని ఉత్సాహాలూ కనబరుస్తూ… అవి కాస్తా తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోయే జబ్బే ఈ బైపోలార్‌ డిజార్డర్‌.