
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకోలేదని, అత్యాచారం చేసి హత్య చేశారని మహరాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం నారాయణ్ రాణే ఆరోపించారు.
దిశా సాలియన్ మరణంపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిశ శవపరీక్ష నివేదికలో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలైన గుర్తులున్నట్లు వెల్లడించారు.దిశా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుల్లోని నిందితుల్ని రక్షించడానికి మహరాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారాయణ్ రాణే అన్నారు.
అంతేకాదు దిశా కుటుంబంపై ఒత్తిడి ఉందని, అందుకే ఆమె మరణంపై విచారణ కోరడం లేదని రాణే ఆరోపించారు. జూన్ 13న సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందని ఆ పార్టీకి నటుడు డీనో మెరియో తో పాటు ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడని నారాయణ్ అనుమానం వ్యక్తం చేశారు.
నారాయణ్ వ్యాఖ్యలపై ఆయన కుమారుడు ఎమ్మెల్యే నితేష్ రాణే మద్దతు పలికారు. మా తండ్రి మమహరాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా బాధ్యతాయుతమైన నాయకుడు ..దిశా సాలియాన్, సుశాంత్ సింగ్ మరణంపై ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు.
తన తండ్రిలాగే, నితేష్ కూడా సుశాంత్ మరణ కేసులో నిజం బయటపడకుండా ఉండటానికి మహారాష్ట్రప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని సూచించారు. దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పార్టీ జరగలేదు
సుశాంత్ సింగ్ ఇంట్లో పార్టీ జరగలేదని ముంబై సీపీ పరమ్ బీర్ సింగ్ ఖండించారు. కేసు విచారణ లో సుశాంత్ ఇంటికి సంబంధించిన జూన్ 13, 14 తేదీల సీసీటీవీ పుటేజ్ చెక్ చేశామని, అందులో సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.దర్యాప్తులో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడి పేరు రాలేదని ముంబై సీపీ పరమ్ బీర్ సింగ్ అన్నారు.