కరోనా పేషంట్ల కోసం వాలంటీర్‌‌గా స్వీడన్‌ యువరాణి

కరోనా పేషంట్ల కోసం వాలంటీర్‌‌గా స్వీడన్‌ యువరాణి
  • మూడు రోజుల ఆన్‌లైన్‌ కోర్సు పూర్తి చేసి
  • హాస్పిటల్‌లో వాలంటీర్‌‌గా సేవలందిస్తున్న ప్రిన్సెస్‌

స్వీడన్‌: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న డాక్టర్లకు సాయం చేసేందుకు స్వీడన్‌ యువరాణి సోఫియా రోగులకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు డాక్టర్లకు హెల్ప్‌ చేసేందుకు ఆసుపత్రిలో పనిలో చేరారు. 35 ఏళ్ల సోఫియా మూడు రోజుల ఆన్‌లైన్‌ పూర్తి చేసుకుని స్టాక్‌హోమ్‌లోని సోఫియాహెమ్మెట్‌ హాస్పిటల్‌లో స్వచ్చందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆమె డైరెక్ట్‌గా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వరని, హెల్త్‌ కేర్‌‌ ప్రొఫెషనల్స్‌కు సపోర్ట్‌గా నాన్‌ మెడికల్‌ టాస్క్‌లు చేస్తారని రాయల్‌ సెంటర్‌‌ ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్‌ వర్కర్స్‌కు సపోర్ట్‌ చేసేందుకు సోఫియాహెమ్మెట్‌ హాస్పిటల్‌ వారు కొంత మంది వాలంటీర్లకు మూడు రోజుల ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశపెట్టి.. పూర్తి చేసుకున్న వారిని హాస్పిటల్‌లో నాన్‌మెడికల్‌ సపోర్ట్‌ స్టాఫ్‌గా నియమించారు. “ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హెల్త్‌ వర్కర్లపై పడ్డ భారాన్ని తొలగించేందుకు ప్రిన్సెస్‌ వాలంటీర్‌‌గా చేరారు” అని రాయల్‌ సెంట్రల్‌ చెప్పింది. డాక్టర్లతో కలిసి ఆమె హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు షేర్‌‌ చేశారు.