పాక్ టార్గెట్ 152..కోహ్లీ హాఫ్ సెంచరీ

V6 Velugu Posted on Oct 24, 2021

టీ20 వరల్ట్ కప్ లో  పాకిస్తాన్ కు 152 పరుగుల టార్గెట్ ను ముందుంచింది భారత్ .  20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి151 పరుగులు చేసింది టీమిండియా. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 151 స్కోర్ చేయగల్గింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ తో, కేఎల్ రాహుల్3  ను షాహీన్ ఆఫ్రిది వెనువెంటనే పెవిలియన్ చేర్చాడు.  ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. 30 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ కోహ్లీ, రిషబ్ పంత్ గట్టెక్కించారు. కెప్టెన్ కోహ్లీ 57, రిషబ్ పంత్ 39 పరుగులు చేయడంతో టీమిండియా151పరుగులు చేయగల్గింది. పాకిస్తాన్ బౌలర్లలో  షాహీన్ ఆఫ్రిది 3, హాసన్ అలీ 2, షాదబ్ ఖాన్, హారీస్ రాఫ్  తలో   ఒక వికెట్ తీశారు.
 

Latest Videos

Subscribe Now

More News