
చైనాతో పాటు ఇతర దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులకు.. కరోనా టెస్టు తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కేంద్రం ఆదేశాల మేరకు ఇకపై కరోనా టెస్ట్ నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే తాజ్ మహల్ చూసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దేశ, విదేశాల నుంచి తాజ్ మహల్ చూసేందుకు పర్యాటకులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. ఫలితంగా కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశముండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.