Health Alert : చలికాలంలో గుండె పదిలం.. జాగ్రత్తగా చూసుకోవాలి

Health Alert : చలికాలంలో గుండె పదిలం.. జాగ్రత్తగా చూసుకోవాలి

సీజన్ మారిందంటే చాలు, కొత్తరకం జబ్బులు వస్తాయి. చలికాలంలో శ్వాససంబంధ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న అనారోగ్యాలే కాదు న్యుమోనియా, టీబీ వంటి సివియర్ డిసీజ్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లు న్యుమోనియా బారిన పడుతుంటారు. ఈ జబ్బుని తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతో క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ని దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు పల్మొనాలజిస్ట్ రఫీ.

న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఒకరకమైన ఇన్ఫెక్షన్ ఇలాంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో మరీ ఎక్కువ. గాలిలోని బ్యాక్టీరియా, వైరస్లు ఊపిరితిత్తుల్లోని ఒకటి లేదా రెండు గాలి సంచుల్ని ఇన్సెక్ట్ చేస్తాయి. లంగ్స్ చుట్టూ నీరు లేదా చీము చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడం. కష్టమవుతుంది. అంతేకాదు దగ్గినా, తుమ్మినా ఛాతిలో నొప్పి వస్తుంది. 

మూడు రకాలు..

న్యుమోనియాలో వైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా, ఎటిపికల్ న్యుమోనియా(మైకో ప్లాస్మా, నిజోమెల్లా కారణంగా వచ్చే న్యుమోనియా) అని మూడు రకాలు ఉంటాయి. చలికాలంలో ఎటిపికల్ న్యుమోనియా కేసులే ఎక్కువ. వీటిలో రెగ్యులర్ గా వచ్చే ఇన్ఫ్ లో యెంజాలు ఎక్కువ ఉంటాయి. పదేళ్ల క్రితం వచ్చిన స్వైన్ ఫ్లూ. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ కూడా కొంతమేరకు న్యుమోనియాకి కారణమవుతున్నాయి. కొన్ని రకాల న్యుమోనియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. 

Also Read :- బిర్యానీలో కోడి తలకాయ

రిస్క్ ని పెంచుతాయి..

 రెగ్యులర్ గా చల్లని ఆహార పదార్థాలు తినడం. రాత్రిపూట చల్లని ఫుడ్ తినడం, చల్లని డ్రింక్స్ తాగడం వల్ల న్యుమోనియా వచ్చే ఛాన్స్ ఉంది. చల్లని, కలుషితమైన వాతావరణంలో ఎక్కువ సేపు ఉండడం, పొద్దుపొద్దున్నే మంచుపడుతున్న టైమ్ లోజాగింగ్, వాకింగ్ కి వెళ్లడం కూడా ఈ డిసీజ్ రిస్క్ ని పెంచుతాయి. ఎందుకంటే పొగతోకూడిన మంచులో వైరస్, బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణమవుతాయి. 

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

జలుబు, జ్వరం, దగ్గు, తెమడ ఎక్కువ రావడం.. చెమట ఎక్కువ పట్టడం, ఆయాసం వంటివి న్యుమోనియాలో కనిపించే సాధారణ లక్షణాలు. ఒక్కోసారి దగ్గినప్పుడు రక్తం కూడా వస్తుంది. న్యుమోనియా ఎక్కువైన కొద్దీ తెమడ ఎక్కువగా వస్తుంది. అంతేకాదు వేగంగా శ్వాస తీసుకోవడం. లేదంటే శ్వాస తీసుకోవడం కష్టమవడం వంటివి. న్యుమోనియా లక్షణాలే. 65 ఏండ్లు దాటిన వాళ్లకి న్యుమోనియా వస్తే ప్రమాదం ఉంటుంది.

టెస్ట్ చేస్తారిలా..

న్యుమోనియా లక్షణాలు ఉన్నా, న్యుమోనియా వచ్చిందేమో అని అనుమానం ఉన్నా వెంటనే ఛాతి ఎక్స్-రే తీయించుకోవాలి. రక్తపరీక్ష, తెమడ పరీక్షలు కూడా చేయించుకోవాలి. 65 ఏండ్లు దాటిన వాళ్లలో ఫ్లూరల్ ఫ్లూయిడ్ కల్చర్ పద్ధతిలో ఇన్ఫెక్షన్ని అంచనా వేస్తారు. ఇమ్యూనిటీ తక్కువ ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, క్రానిక్ డిసీజ్లు ఉన్నవాళ్లలో న్యుమోనియా తీవ్రత ఎక్కువ, డయాబెటిస్, స్మోకింగ్ వంటివి కూడా ఈ డిసీజ్ ముప్పుని పెంచుతాయి. 

చికిత్స ఇలా...

యాంటీ బయాటిక్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ వాడాలి. మరీ తీవ్రమైన లక్షణాలు ఉంటే ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి ఉంటుంది. న్యుమోనియా తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. శ్వాసతీసుకోవడం మరీ కష్టమైనప్పుడు, ఆయాసం, తెమడ ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్పించాలి. ఫ్లూయిడ్స్ ఎక్కించడం, యాంటీ బయాటిక్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కోలుకుంటారు. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే, ఓరల్ యాంటీ బయాటిక్ సరిపోతుంది. 

ఈ జాగ్రత్తలు ముఖ్యం.. 

వైరల్, ఎటిపికల్, బ్యాక్టీరియల్... ఏ రకం న్యుమోనియాకి అయినా ఒకేరకమైన జాగ్రత్తలు : తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువమంది ఉన్న దగ్గర, కలుషితమైన పరిసరాల్లో తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. దాంతో వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ముప్పు కొంత తగ్గుతుంది. అప్పటికప్పుడు పండుకొని వేడివేడిగా తినాలి. ఫుడ్ ని వేడిచేసుకొని తినే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. 

శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలి. స్మోకింగ్ మానేయాలి. బి.పి పడిపోవడం, తెమడ ఎక్కువ రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే డాక్టర్ ని కలవాలి. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయాలి. 

వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది..

సాధారణంగా వారం రోజుల్లో న్యుమోనియా తగ్గిపోతుంది. సివియర్ ఉంటే 2 నుంచి 3 వారాలు పడుతుంది. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది. న్యుమోనియాకి కూడా వ్యాన్ ఉంది. చిన్నపిల్లలకి కూడా న్యుమోనియా వ్యాక్సిన్ వేయించాలి. చలికాలం మొదట్లోనే న్యుమోనియా వ్యాక్సిన్, ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ వేసుకుంటే న్యుమోనియా రాకుండా జాగ్రత్తపడొచ్చు.

ఇన్ఫెక్షన్ తీరుని బట్టి..  

ఇన్ఫెక్షన్ అయ్యే తీరుని బట్టి కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యుమోనియా హెల్త్ కేర్ అసోసియేటెడ్ న్యుమోనియా హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యుమోనియా అని 3 రకాలుగా ఉంటుంది. వేరే ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళ్లిన కొందరికి రెండు రోజుల తర్వాత న్యుమోనియా వస్తుంది. దాన్ని హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యుమోనియా అంటారు. క్రానిక్ డిసీజ్లు, నర్సింగ్ కేర్ ద్వారా వచ్చే న్యుమోనియాని హెల్త్ కేర్ అసోసియేటెడ్ న్యుమోనియా అంటారు.