తాలిబాన్లకు పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మద్దతు

తాలిబాన్లకు పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మద్దతు

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌పై తాలిబాన్ల ఆధిపత్యానికి అంగీకరిస్తూ, వాళ్లకు మద్దతుగా కామెంట్స్ చేశాడు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. తాలిబాన్లు పాజిటివ్ మైండ్‌తో అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని తమ చేతిలోకి తీసుకున్నారని అన్నాడు. తాలిబాన్ల గురించి అఫ్రిది మీడియాతో మాట్లాడుతున్న ఓ వీడియోను పాక్‌ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్వీట్ చేశారు. ‘‘అఫ్గాన్‌లో తాలిబన్లు ఒక పాజిటివ్ మైండ్‌తో అధికారంలోకి వచ్చారు. వాళ్లు మహిళలను ఉద్యోగాలు చేసుకోనిస్తున్నారు. రాజకీయాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు” అని అఫ్రిది అన్నాడు. అలాగే తాలిబాన్లకు క్రికెట్‌ అంటే ఇష్టమని అనుకుంటున్నానని అన్నాడు. వాళ్ల రాకతో అఫ్గాన్‌లో క్రికెట్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నానని అఫ్రిది చెప్పాడు.