ఎలక్షన్ కమిషన్నే రద్దు చేసిన్రు

ఎలక్షన్ కమిషన్నే రద్దు చేసిన్రు

కాబూల్: అఫ్గానిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్‌ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని బిలాల్ తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థలో పలు అనవసర మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, అందుకే వాటిని తొలగిస్తున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

చలి గుప్పిట్లో ఉత్తర భారతం

30 వరకు అయ్యప్ప దర్శనాలు బంద్

ఒక్క ఆలోచన కోట్లు కురిపిస్తోంది