- ఆంధ్రాకు, తెలంగాణలకు మా ఆక్సిజన్ పంపొద్దు
- తమిళనాడుకు కేటాయించిందే తక్కువ
- కేసులు ఎక్కువైతున్నయ్.. డిమాండ్ పెరుగుతోంది
- ప్రధానికి పళనిస్వామి లెటర్
తమిళనాడుకు మెడికల్ కేటాయింపులే తక్కువ.. మళ్లీ అందులోంచి ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి కేంద్రాన్నికోరారు. తమ రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్ తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. ‘‘మా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. పోయినేడాదిలో యాక్టివ్ కేసుల సంఖ్య అత్యధికంగా 58 వేల వరకు ఉండగా.. ఇప్పుడు లక్ష దాటింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది”అని పళనిస్వామి లెటర్లో పేర్కొన్నారు.
ఆక్సిజన్ తక్కువ కేటాయించిన్రు..
‘రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ త్వరలో 450 మెట్రిక్ టన్నులకు చేరనుంది. కానీ, రాష్ట్ర వ్యాప్తం గా ఉత్పత్తి అవుతున్నది 400 మెట్రిక్ టన్నులే. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి 220 మెట్రిక్ టన్ను ల ఆక్సిజన్ కేటాయించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటికే ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులకు చేరింది’ అని సీఎం చెప్పారు.
డిమాండ్ ఎక్కువుంది..
రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉండగా, ఉత్పత్తి తక్కువుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు కేటాయించడం కరెక్టు కాదు. ఇది చెన్నై,ఇతర జిల్లాల్లో సంక్షోభానికి దారి తీస్తుంది అని పళనిస్వామి కోరారు.
