ఫుడ్ డెలివరీ బాయ్‌‌ని కొట్టిన కానిస్టేబుల్

ఫుడ్ డెలివరీ బాయ్‌‌ని కొట్టిన కానిస్టేబుల్

ఫుడ్ డెలివరీ చేసే బాయ్ చెంపలను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎడాపెడా వాయించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానిస్టేబుల్ పై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. సింగనల్లూరు పీఎస్ లో గ్రేడ్ 1 కానిస్టేబుల్ గా సతీష్ పని చేస్తున్నారు. Avinashi రోడ్డులో ట్రాఫిక్ జంక్షన్ వద్ద శుక్రవారం విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న 38 ఏళ్లున్న మోహన సుందరం Avinashi రోడ్డు మీదుగా వెళుతున్నాడు. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంతో నడపడం గమనించాడు.

ఓ మాల్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలను, పాదాచారులను ఢీకొనే విధంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం చూశాడు. వెంటనే అతడు మోహన సుందరం బస్సు డ్రైవర్ ను నిలదీశాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ సతీష్.. మోహన సుందరాన్ని నిలదీశాడు. అతడితో దుర్భషలాడాడు. ఆవేశానికి లోనై.. మోహన సుందరం చెంపలను ఎడాపెడా వాయించాడు. అంతేగాకుండా... అతని మొబైల్ ఫోన్ ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మరొక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అనంతరం మోహన సుందరం శనివారం నగర పోలీస్ కమిషనర్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు సతీష్ ను కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.
 

మరిన్ని వార్తల కోసం : -

స్పైడర్ మ్యాన్ కాదు.. వింత దొంగ


కుక్కను బతికించాడు.. హృదయాలను కదిలిస్తున్న వీడియో