గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాటాల ఈవీ బ్యాటరీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..  రూ.13 వేల కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాటాల ఈవీ బ్యాటరీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..  రూ.13 వేల కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​

న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి  టాటా గ్రూప్ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. టాటా గ్రూప్ సబ్సిడరీ అగర్తస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌‌‌‌ గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.13 వేల కోట్లతో బ్యాటరీ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెడతామని, రానున్న మూడేళ్లలో ప్లాంట్  పనులు మొదలవుతాయని పేర్కొంది.  ప్రారంభంలో ఈ ప్లాంట్ కెపాసిటి ఏడాదికి 20 గిగావాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  సెకెండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా విస్తరించే అవకాశం ఉంది.  టాటా సన్స్ బోర్డ్ ఈ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వచ్చే వారం  ఈ కంపెనీ బోర్డు ముందుకు ప్రపోజల్స్ వెళ్లనున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోంది.  పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి కంపెనీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయపడుతుందని అంచనా. రాష్ట్రంలో లిథియం అయాన్ బ్యాటరీ  సెల్ తయారీ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తరించడంలో  టాటా గ్రూప్ సాయపడుతుందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్వీట్ చేశారు. ఈవీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడం ద్వారా  కార్బన్ ఎమిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి తమ ప్రభుత్వం  కట్టుబడి ఉందన్నారు.  

ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాటా మోటార్స్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతోంది. కానీ, పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ కార్లతో పోలిస్తే  ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఇంకా చాలా తక్కువగా  ఉన్నాయి. కిందటేడాది మొత్తం 38 లక్షల కార్లు సేల్ అవ్వగా వీటిలో ఒక శాతం మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీకి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈవీలు తయారు చేయడానికి రానున్న ఐదేళ్లలో 19 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని టాటా మోటార్స్ సబ్సిడరీ కంపెనీ జాగ్వార్​ ల్యాండ్ రోవర్ (జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. యూకేలోని జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, బ్యాటరీ ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  తయారు చేస్తామని జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ తెలిపింది. 

యూకేలో మరో బ్యాటరీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 టాటా గ్రూప్ మరో బ్యాటరీ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుంది. టాటా సన్స్ బాస్ నటరాజన్ చంద్రశేఖరన్  లండన్ వెళ్లి యూకే పీఎం రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశం కానున్నారని రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత వరకు ఇస్తారనే అంశాలపై చర్చించనున్నారని అంచనా. ఈ కొత్త ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈస్ట్ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సోమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సుమారు 9 వేల మందికి ఉద్యోగాలొస్తాయని యూకే న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లు రిపోర్ట్ చేశాయి.  టాటా మోటార్స్  బ్యాటరీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు  బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుందని వెల్లడించాయి.