ఉద్యోగులకు ఫేవరెట్​ కంపెనీ  టాటా పవర్​

ఉద్యోగులకు ఫేవరెట్​ కంపెనీ  టాటా పవర్​
  • తరువాతి స్థానంలో అమెజాన్  

న్యూఢిల్లీ: మనదేశంలో ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే కంపెనీగా టాటా పవర్ నిలిచింది.  కంపెనీ ఆర్థిక బలం, మంచి పేరు,  కెరీర్ పురోగతి వంటి విషయాల్లో ఇది అత్యధిక స్కోర్ సాధించింది.  రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాడ్ ఇండియా  వార్షిక నివేదిక 'ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్​ఈబీఆర్​) 2023' ప్రకారం..ఈ విషయంలో అమెజాన్​ రెండోస్థానంలో ఉండగా, మూడో స్థానంలో మరో టాటా గ్రూప్​ కంపెనీ టాటా స్టీల్​ ఉంది. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  4వ స్థానాన్ని దక్కించుకోగా, మైక్రోసాఫ్ట్, శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎమ్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్  మెగాస్టోర్ బిగ్ బాస్కెట్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన స్టార్టప్ ఎంప్లాయర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించింది.

ఎక్కువ మంది ఉద్యోగులు ఆటోమోటివ్ (77 శాతం)  అత్యంత ఆకర్షణీయమైన రంగమని చెప్పారు. తర్వాత ఐటీ, ఐటీఈఎస్​,  టెలికాం (76 శాతం),  ఎఫ్​ఎంసీజీ, రిటైల్, ఈ–-కామర్స్ (75 శాతం) ఉన్నాయి. ఆర్​ఈబీఆర్​ రిపోర్ట్​ కోసం ప్రపంచవ్యాప్తంగా 1.63 లక్షల మంది రెస్పాండెంట్ల నుంచి సమాచారం సేకరించారు. వీరంతా 32 మార్కెట్లకు చెందినవాళ్లు. ఉద్యోగం–-జీవితం మధ్య బ్యాలెన్స్​,  మంచి పేరు,  ఆకర్షణీయమైన జీతం,  ప్రయోజనాలు ... కంపెనీని ఎన్నుకునేటప్పుడు ఉద్యోగులు చూస్తున్న మూడు ముఖ్యమైన అంశాలు. మహిళా ఉద్యోగులు పని–-జీవితం మధ్య బ్యాలెన్స్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే ఉద్యోగాలు లేదా అసైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్వీకరించడానికి అనుమతించినట్లయితే యజమానిని మరింత అభిమానిస్తామని 91 శాతం మంది తెలిపారు.