18 ఏళ్ల తర్వాత పేరు మార్చుకున్న టాటా స్కై

 18 ఏళ్ల తర్వాత పేరు మార్చుకున్న టాటా స్కై

న్యూఢిల్లీ: డీటీహెచ్ కంపెనీ టాటా స్కై 18 ఏళ్ల తర్వాత తన బ్రాండ్‌‌‌‌ పేరును మార్చుకుంది. టాటా గ్రూప్‌‌– వాల్ట్‌‌ డిస్నీకి చెందిన ఈ జాయింట్ వెంచర్ కంపెనీ తన బ్రాండ్‌‌ను టాటా ప్లేగా మార్చింది. మొదట్లో డీటీహెచ్‌‌ కంపెనీగా ఎంటర్ అయినప్పటికీ ప్రస్తుతం ఫైబర్‌‌‌‌–టూ–హోమ్‌‌ బ్రాడ్‌‌బ్యాండ్‌‌, ఓటీటీ సర్వీస్‌‌లను ఆఫర్ చేస్తున్న (బింజ్‌‌) బిజినెస్‌‌లలోకి ఎంటర్ అయ్యింది. దేశంలో 1.9 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్ల ఉన్నారని కంపెనీ చెబుతోంది. ‘డీటీహెచ్‌‌ కంపెనీగా స్టార్టయినప్పటికీ, ప్రస్తుతం కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఎదిగాం’ అని టాటా ప్లే సీఈఓ, ఎండీ హరిత్‌‌ నాగ్‌‌పాల్‌‌ అన్నారు. తమ బిజినెస్‌‌లలో డీటీహెచ్ అతిపెద్ద సెగ్మెంట్‌‌గా కొనసాగుతుందని, అలానే ఓటీటీ  బిజినెస్‌‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు.