29 టాటా కంపెనీలు మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్

29 టాటా కంపెనీలు మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: స్టాక్ మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ అయిన తమ కంపెనీలను సగం చేయాలని టాటా గ్రూప్ చూస్తోంది. ప్రస్తుతం 29 టాటా కంపెనీలు మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ అయ్యాయి. వీటిని 15 కి తగ్గించాలని టాటా సన్స్ చూస్తోందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఉప్పు నుంచి కార్లు, టెక్నాలజీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్  వరకు వివిధ సెక్టార్లలో వ్యాపారాలు చేస్తున్న టాటా గ్రూప్‌‌‌‌, కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి, వాటిని పెద్ద కంపెనీలుగా మార్చాలని చూస్తోంది. టాటా గ్రూప్​కు  ఏడాదికి రూ.10.24 లక్షల కోట్ల రెవెన్యూ వస్తోంది. ఈ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్‌‌‌‌ క్యాప్ రూ.20.55 లక్షల కోట్లుగా ఉంది. పెద్ద కంపెనీల గ్రోత్‌‌‌‌ను, క్యాష్ ఫ్లోస్‌‌‌‌ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే ఆలోచనలో ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వంలోని టాటా సన్స్ ఉంది. టాటా గ్రూప్‌‌‌‌ను ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కు రెడీ చేస్తున్నామని ఆయన గతంలోనే  పేర్కొన్నారు. చిన్న కంపెనీలు  ఎక్కువగా ఉంటే వాటిని మేనేజ్ చేయడానికి ఎక్కువ టైమ్  కేటాయించాల్సి ఉంటుంది. ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది కూడా. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ అయిన 29 కంపెనీలతో పాటు లిస్టింగ్ కాని సుమారు ఐదు డజన్ల సబ్సిడరీలను టాటా గ్రూప్‌‌ ఆపరేట్‌‌‌‌ చేస్తోంది. ఇప్పటికే ఏడు మెటల్ కంపెనీలను టాటా స్టీల్‌‌‌‌లో విలీనం చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌‌‌‌లో టాటా కాఫీ బిజినెస్‌‌‌‌లను విలీనం చేస్తామని ప్రకటించారు.

కొన్నేళ్లుగా విలీనం చేస్తూ..

‘ఈ పని చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. విలీనాలతో అవసరం లేని వారిని తీసెయ్యడానికి, అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి వీలుంటుంది. అప్పటి పరిస్థితులు బట్టి చాలా చిన్న కంపెనీలను క్రియేట్ చేశారు. మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ చేశారు.  ప్రస్తుతం క్యాపిటల్‌‌‌‌ను పెంచుకోవడానికి, రీసోర్స్‌‌‌‌లను వాడుకోవడానికి విలీనం సాయపడుతుంది’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, టాటా గ్రూప్ గత కొన్నేళ్ల నుంచే వివిధ సెక్టార్లలోని బిజినెస్‌‌‌‌లను కన్సాలిడేట్ చేస్తూ వస్తోంది. 2018 లో ఏరోస్పేస్‌‌‌‌ అండ్ డిఫెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని వివిధ వ్యాపారాలను టాటా ఏరో స్పేస్‌‌‌‌ అండ్ డిఫెన్స్ కిందకు తీసుకొచ్చింది. 2017 లో సీఎంసీని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌లో విలీనం చేసింది. ప్రస్తుతం టెక్నాలజీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో టాటా గ్రూప్‌‌‌‌కు టీసీఎస్‌‌‌‌, టాటా ఎలెక్సీ కంపెనీలు ఉన్నాయి. అన్‌‌‌‌లిస్టెడ్ కంపెనీ  అయిన టాటా డిజిటల్‌‌‌‌ను కూడా ఈ గ్రూప్ నిర్వహిస్తోంది. ఆటోమొబైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కూడా టాటా గ్రూప్‌‌‌‌కు మూడు  లిస్టెడ్ కంపెనీలు..టాటా మోటార్స్‌‌‌‌, ఆటోమోటివ్‌‌‌‌ స్టాంపింగ్స్‌‌‌‌ అండ్ అసెంబ్లీస్‌‌‌‌, ఆటోమొబైల్ కార్పొరేషన్‌‌‌‌ ఆఫ్ గోవాలు ఉన్నాయి. టాటా ఆటోకాంప్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ ఇంకా మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కాలేదు. ఈ గ్రూప్  ఇన్‌‌‌‌ఫ్ట్రాస్ట్రక్చర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో అతిపెద్ద సంస్థను క్రియేట్ చేయాలని చూస్తోంది.  ఇందుకు గాను ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని టాటా ప్రాజెక్ట్స్‌‌‌‌, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్‌‌‌‌, టాటా రియల్టీ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌, టాటా హౌసింగ్‌‌‌‌లను విలీనం చేసే అవకాశం ఉంది. టాటా గ్రూప్‌‌‌‌కు మూడు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ కంపెనీలు కూడా ఉన్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఏషియా ఇండియా, విస్తారాలను తాజాగా కొనుగోలు చేసిన ఎయిర్‌‌‌‌‌‌‌‌ఇండియాలో విలీనం చేసే ప్లాన్‌‌‌‌లో ఉన్నారు. రిటైల్ బిజినెస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని వోల్టాస్‌‌‌‌, టైటాన్‌‌‌‌, క్రోమా బ్రాండ్‌‌‌‌ను ఆపరేట్ చేస్తున్న ఇన్ఫినిటీ రిటైల్‌‌‌‌, ట్రెంట్‌‌‌‌లు టాటాలకు చెందినవే. టెలికమ్యూనికేషన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో లిస్డెడ్ కంపెనీలయిన టాటా కమ్యూనికేషన్స్‌‌‌‌, టాటా టెలీసర్వీసెస్‌‌‌‌ (మహారాష్ట్ర)లను, అన్‌‌‌‌లిస్డెడ్ కంపెనీలయిన టాటా టెలీసర్వీసెస్‌‌‌‌, టాటా ప్లేలను ఈ గ్రూప్ ఆపరేట్ చేస్తోంది. కంపెనీకి టాటా కెమికల్స్‌‌‌‌, ర్యాలిస్ ఇండియా రూపంలో రెండు లిస్డెడ్ కెమికల్స్ కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్‌‌‌‌ కొత్త సెక్టార్‌‌‌‌‌‌‌‌లలో కూడా విస్తరిస్తోంది. సెమికండక్టర్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌లోకి ఎంటర్ అవుతామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.