
మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయని.. కానీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ స్టూడెంట్స్ లో ఉండటం లేదని అన్నారు మంత్రి వివేక్. విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ పెంచి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసే బాధ్యత టీచర్స్ పైనే ఉందని సూచించారు. సోమవారం (సెప్టెంబర్ 08) హైదరాబాద్ లో ఉపాధికల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి వివేక్.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాలని టీచర్లకు సూచించారు. సబ్జెక్ట్ ఉన్నప్పటికీ స్కిల్స్ లేకుంటే జాబ్ రాదని అన్నారు. ఇంటర్వ్యూలో సాఫ్ట్ స్కిల్స్ తెలియకపోవడంతో సరిగ్గా చెప్పకుంటే జాబ్ రావడం కష్టమని అన్నారు. అందుకోసం విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైనే ఉందని అన్నారు. టాటా గ్రూప్ 4 వందల కోట్ల పెట్టుబడులు పెడుతోందని.. మంచి రిజల్స్ట్ ఇచ్చినప్పుడే వాళ్లకు కూడా సంతృప్తి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ : మైత్రీవనం HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత..
ఏటీసీ చరిత్రలోనే తొలిసారి టీచర్స్ డే నిర్వహించడం సంతోషకంగా ఉందన్నారు మంత్రి. ఏటీసీల్లో 100 శాతం అడ్మిషన్లు పూర్తి చేసిన వారికి సన్మానం చేశారు. ATC సెంటర్లలో మొత్తంగా 90 శాతం అడ్మిషన్లు వచ్చాయంటే మంచి విషయమని అన్నారు.
స్టూడెంట్స్ ను మంచిగా ట్రెయిన్ చేస్తాం అనే గోల్ పెట్టుకోవాలని టీచర్లకు సూచించారు. మోటివేషన్, మెంటరింగ్ చేసినప్పుడు పైకి వస్తారని అన్నారు. అడ్మిషన్లతో పాటు రిజల్ట్స్ పై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. టీచర్స్ కు ఉన్న రెస్పెక్ట్ సమాజంలో ఏ ప్రొఫెషన్ లో లేదని.. అందుకోసం మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన బాధ్యత టీచర్లపైన ఉందన్నారు మంత్రి వివేక్.
విద్యార్థుల క్యారెక్టర్, ఫ్యూచర్ బిల్డింగ్ లో టీచర్లది కీలక పాత్ర అని చెప్పిన మంత్రి.. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి పనిచేస్తే.. ఐటీఐ, ఏటీసీలలో మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు. ఐటీఐ, ఏటీసీ లకు మంచి గుర్తింపు వచ్చేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు.
ఏటీసీ సెంటర్లలో ఎన్నో ఫెసిలిటీలు ఉన్నాయని.. విద్యార్థులు మంచి గోల్ పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. టీచర్ మాట ప్రకారం ముందుకు వెళ్లిన విద్యార్థులు సక్సెస్ సాధిస్తారని అన్నారు. తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదుకున్నానని చెప్పిన మంత్రి.. టాప్ 10 కంపెనీలకు సీఈవోలుగా అక్కడ చవుదుకున్న వాళ్లు పని చేస్తున్నారని తెలిపారు. ATC ల్లో 539 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం సీఎం ను కలిసి చెప్తానని చెప్పారు.