ఆర్మీ స్కూల్స్‌‌లో 8వేల టీచర్​ ఉద్యోగాలు

ఆర్మీ స్కూల్స్‌‌లో 8వేల టీచర్​ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పాఠశాలల్లో  8 వేల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‍ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్‍ టీచర్స్, ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ టీచర్స్ పోస్టులు భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‍ ఎడ్యుకేషన్‍ సొసైటీ  ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 21 వరకు ఆన్​లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్​లో రిటెన్​ టెస్ట్​ నిర్వహిస్తారు.

పీజీటీ: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత. చాలా పోస్టులకు ఆల్టర్నేటివ్​ విద్యార్హతలున్నాయి.

టీజీటీ: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ పాసవ్వాలి.

పీఆర్టీ: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ లేదా రెండేళ్ల డీఎల్​ఈడీలో ఉత్తీర్ణత. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్​ బీఈడీ కలిగిన వారు అర్హులే.

నోట్‍: డిగ్రీలో 50 శాతం కంటే తక్కువ మార్కులొచ్చి పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందినవారూ అర్హులే. స్ర్కీనింగ్ టెస్టుకు టెట్‍/సీటెట్‍ అర్హత అవసరం లేదు. టీజీటీ/పీఆర్​టీ, ఇంటర్వ్యూ, ప్రొఫీషియన్సీ టెస్ట్​కు తప్పనిసరి.

వయసు:

ప్రెషర్స్: 2020 ఏప్రిల్‍ 1 నాటికి 40 సంవత్సరాలు దాటకూడదు. (ఢిల్లీ పాఠశాలలకు టీజీటీ/పీఆర్టీ అయితే 29 సంవత్సరాలు, పీజీటీ అయితే 36 ఏళ్ల లోపు) ఐదేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్నవారు ఈ కేటగిరీలో అప్లై చేసుకోవాలి.

ఎక్స్‌‌పీరియన్స్: 57 సంవత్సరాలు దాటకూడదు. గడిచిన పదేళ్లలో కనీసం 5 సంవత్సరాల టీచింగ్‍ ఎక్స్‌‌పీ‍రియన్స్ కలిగి ఉండాలి.

ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్‌‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్మీ స్కూల్‍ సొసైటీ వైబ్‌‌సైట్‌‌లో అప్లై చేసిన తర్వాత ఫోటో, సంతకం అప్‌‌లోడ్‌‌ చేయాలి. దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి. ఎడిటింగ్‍ ఆప్షన్‍ ఉండదు. ఒక్కో అభ్యర్థి ఒక్క పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

సబ్జెక్టులు

ఇంగ్లిష్‍, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్‍ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్‍ సైన్స్/ఇన్ఫర్మాటిక్స్, హోంసైన్స్, ఫిజికల్‍ ఎడ్యుకేషన్.

పరీక్షా  కేంద్రాలు: హైదరాబాద్‍, సికింద్రాబాద్‍, విజయవాడ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరితేది: 2019 సెప్టెంబర్​ 22

అడ్మిట్‍ కార్డ్ డౌన్‍లోడ్‍: 2019 అక్టోబర్​ 4

పరీక్ష తేది: 2019 అక్టోబర్​ 19, 20

వెబ్‌‌సైట్‌‌: www.aps-csb.in

ఆర్మీ పబ్లిక్‍ స్కూల్స్ గురించి..

దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్‍ ప్రాంతాలు, మిలిటరీ స్టేషన్లలో 137 ఆర్మీ పబ్లిక్‍ పాఠశాలలున్నాయి. వీటిలో సీబీఎస్‍ఈ సిలబస్‍ను బోధిస్తారు. సైనికులు, జూనియర్‍ కమీషన్డ్ ఆఫీసర్లు వంటి అధికారుల పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యనందించేందుకు 1980 జనవరి 15 న ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఆర్మీ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేశారు. 1983లో వీటిని ఆర్మీ వెల్ఫేర్‍ సొసైటీ కిందకు తెచ్చారు. 2011లో వీటి పేరును ఆర్మీ పబ్లిక్‍ స్కూల్స్ గా మార్చారు. ప్రస్తుతం తెలంగాణలో సికింద్రాబాద్‍ (ఆర్కే పురం, బొల్లారం), హైదరాబాద్‍ (గోల్కొండ) లో మొత్తం 3 స్కూళ్లున్నాయి.

జీతభత్యాలు

టీచర్ కొలువు అంటే భద్రత, సుస్థిర భవిషత్తుకు కేరాఫ్‍గా మారింది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లాగానే వీటికి కూడా శాలరీ భారీగానే వస్తుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని ప్రారంభంలో పోస్ట్‌‌ గ్రాడ్యుయేట్‌‌ టీచర్‌‌కు 40 నుంచి 50 వేలు, ట్రెయిన్డ్‌‌ గ్రాడ్యుయేట్‌‌ టీచర్‌‌కు 30 నుంచి 40 వేలు, ప్రైమరీ టీచర్‌‌కు 20 నుంచి 30 వేలు లభిస్తుంది. వీటికి తోడు ఇతర అన్ని అలవెన్సులు, రుణ సదుపాయాలుంటాయి. జీతభత్యాలు పోస్టింగ్‍ ఇచ్చే ప్రాంతాన్ని బట్టి మారుతాయి.

సెలెక్షన్​ ప్రాసెస్​
స్ర్కీనింగ్‍ టెస్ట్, ఇంటర్వ్యూ, ‍టీచింగ్‍ స్కిల్స్ అండ్ కంప్యూటర్‍ ప్రొఫిషియన్సీ టెస్టు అనే మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి స్కోర్‍ కార్డులు జారీ చేస్తారు. మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉండే ఈ స్కోర్‍ కార్డుతో ఇతర సీబీఎస్‍ఈ స్కూళ్లలో జరిగే ఇంటర్వ్యూలకు కూడా హాజరవచ్చు. ఇదివరకే ఈ పరీక్ష రాసినవారు స్కోర్‍ పెంచుకోవడానికి లేదా టీజీటీ నుంచి పీజీటీ ఆప్‍గ్రేడ్‍ చేసుకోవడానికి మళ్లీ రాయవచ్చు. స్ర్కీనింగ్‍ టెస్ట్​లో అర్హత సాధించిన వారు నియామకాల కోసం నేరుగా ఆయా పాఠశాలలను సంప్రదించాలి. ఈ పాఠశాలలు డిసెంబర్‍ నుంచి మార్చి వరకు ఇంటర్వూలు, ‍టీచింగ్‍ స్కిల్స్ అండ్ కంప్యూటర్‍ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహించి అభ్యర్థులను రిక్రూట్‍ చేసుకుంటాయి. లాంగ్వేజ్​ టీచర్లకు టీచింగ్​ స్కిల్స్​ టెస్ట్‌‌‌‌‌‌తో పాటు 30 మార్కులకు ఎస్సే & కాంప్రెహెన్సన్​ టెస్ట్ ఉంటుంది.

పరీక్షా విధానం

పరీక్ష మల్టిపుల్‍ చాయిస్‍ విధానంలో ఆన్‍లైన్‍లో జరుగుతుంది. పీజీటీ/టీజీలో ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–A అందరికి కామన్​. పార్ట్–B లో సంబంధిత సబ్జెక్టు నుంచి 180 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పీఆర్టీ పరీక్ష 90 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు మైనస్​ అవుతుంది. గరిష్ఠ మార్కులను నార్మలైజేషన్‍ విధానంలో 100 కు తగ్గిస్తారు. పార్ట్–B లో ఫెయిలై పార్ట్–A లో అర్హత పొందిన వారు పీఆర్టీ పోస్టుకు కూడా అర్హులే. క్వాలిఫై అవ్వాలంటే కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 

 

విభాగం సబ్జెక్టు మార్క్స్​ టైమ్​
 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‍ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్‍ టీచర్స్ (టీజీటీ /పీజీటీ )
పార్ట్​–A జనరల్‌‌ అవేర్‍నెస్‍, మెంటల్‍ ఎబిలిటీ, ఇంగ్లిష్‍ కాంప్రహెన్సెన్‍, ఎడ్యుకేషనల్‍ కాన్సెప్ట్స్ అండ్‍ మెథడాలజీ 90 3 గం.

 

పార్ట్​–B సంబంధిత సబ్జెక్టు 90
 ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ టీచర్స్ (పీఆర్టీ)
పార్ట్​–A జనరల్‌‌ అవేర్‍నెస్‍, మెంటల్‍ ఎబిలిటీ, ఇంగ్లిష్‍ కాంప్రహెన్సెన్‍,  ఎడ్యుకేషనల్‍ కాన్సెప్ట్ అండ్‍ మెథడాలజీ 90 90 ని.