ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ట్రెయినింగ్‌

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ట్రెయినింగ్‌
  • జడేజా రీఎంట్రీకి  లైన్​ క్లియర్​

నాగ్​పూర్: స్వదేశంలో వరుసగా షార్ట్​ ఫార్మాట్​ సిరీస్​లు నెగ్గి జోష్​మీదున్న టీమిండియా.. టెస్ట్​ ఫార్మాట్​లో అసలు సమరానికి రెడీ అవుతోంది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే నాలుగు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ (బోర్డర్​–గావస్కర్​ ట్రోఫీ) కోసం ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ మెగా సిరీస్​ కోసం బీసీసీఐ.. ఐదు రోజుల క్యాంప్​ను ఏర్పాటు చేసింది.  శుక్రవారం ఓల్డ్​ వాకా స్టేడియంలో  ఇండోర్​, ఔట్​డోర్​లో రెండు నెట్​ నెషన్స్ లో ప్రాక్టీస్‌‌ చేసింది. గ్రౌండ్‌‌లోని నెట్స్‌‌లో కెప్టెన్​ రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్​, చతేశ్వర్​ పుజారా, శుభ్​మన్​ గిల్​ తీవ్రంగా చెమటోడ్చారు. ఈ సిరీస్​ నెగ్గితే అటు వరల్డ్​చాంపియన్​షిప్​ ఫైనల్​ బెర్త్​తో పాటు లాంగ్​ ఫార్మాట్​లో నంబర్​వన్​ ర్యాంక్​ దక్కే అవకాశం ఉండటంతో.. ఇండియా ఏ చాన్స్​ను వదులుకోవడం లేదు.  గాయంతో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ తొలి టెస్టుకు దూరం అవ్వగా..  మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాతో పాటు, తెలుగు వికెట్​ కీపర్​ కేఎస్​ భరత్ నెట్స్​లో శ్రమించారు. జడేజా తొలుత ఇండోర్‌‌ సెషన్‌‌లో బౌలింగ్‌‌, బ్యాటింగ్‌‌ చేశాడు. తర్వాత బయట నెట్స్‌‌లోనూ బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌లో పాల్గొన్నాడు. మార్నింగ్‌‌ సెషన్‌‌లో రెండున్నర గంటల పాటు ఓ బ్యాచ్‌‌ ట్రెయినింగ్‌‌లో పాల్గొనగా.. మధ్యాహ్నం మరో బ్యాచ్‌‌ చెమటోడ్చింది. ఇక, టీమిండియా నెట్​ ప్రాక్టీస్​ కోసం బీసీసీఐ కేవలం స్పిన్నర్లనే కేటాయించింది. వాషింగ్టన్​ సుందర్​, సౌరభ్ కుమార్​, రాహుల్​ చహర్, సాయి కిశోర్​ ఇందులో ఉన్నారు. ఎక్స్​ట్రా పేసర్ల గురించి టీమిండియా ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇక మెయిన్​ టీమ్​లో అశ్విన్​, అక్షర్​ పటేల్​, కుల్దీప్​, జడేజా ఉన్నారు.  మరో రెండు రోజుల ప్రాక్టీస్​ తర్వాత.. ఆసీస్​ బలాన్ని లెక్కలోకి తీసుకుని టీమిండియా ఫైనల్ ఎలెవన్​పై ఓ అంచనాకు రావొచ్చు.  

అశ్విన్ ‘డూప్లికేట్’తో ఆసీస్‌‌ ప్రాక్టీస్‌‌

స్పిన్​ ఫ్రెండ్లీ వికెట్లపై ఇండియాను దీటుగా ఎదుర్కొనేందుకు ఆసీస్​ కూడా అంతే పకడ్బందీగా ప్లాన్స్​ రెడీ చేస్తోంది. ఆలూర్​లోని కర్నాటక స్టేట్​ క్రికెట్​ అసోసియేషన్​ (కేఎస్​సీఏ) గ్రౌండ్​లో ప్రాక్టీస్​ చేస్తున్న కంగారూలు... ఈ సిరీస్​లో తమకు అత్యంత ప్రమాదకరంగా మారే ఆఫ్​ స్పిన్నర్ ​ అశ్విన్​ బౌలింగ్​పై ఎక్కువగా దృష్టి సారించారు. ఇందుకోసం అచ్చం అశ్విన్​లాగా స్పిన్​వేసే మహేశ్​ పిథియా బౌలింగ్​లో గురువారం ప్రాక్టీస్​ చేశారు. రోజంతా బౌలింగ్​​ వేసిన పిథియా.. స్మిత్​, లబుషేన్​, ట్రావిస్​ హెడ్​ను బాగా ఇబ్బందిపెట్టాడు. జునాగఢ్​కు చెందిన 21 ఏళ్ల పిథియా ఇంట్లో టీవీ లేకపోవడంతో 11 ఏళ్ల వయసు వచ్చే వరకు కనీసం అశ్విన్​ బౌలింగ్​ను కూడా చూడలేదు. అయితే 2013 విండీస్​ టూర్​ సందర్భంగా పిథియా... అశ్విన్​ బౌలింగ్​ను చూసి ఇంప్రెస్​ అయ్యాడు. అప్పట్నించి అశ్విన్​ను ఆరాధించడం మొదలుపెట్టాడు. మొన్న డిసెంబర్​లో బరోడా తరఫున ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో డెబ్యూ చేసిన పిథియా బౌలింగ్​ ఫుటేజ్​ను సోషల్​ మీడియాలో చూసి ఆసీస్​ తమ ప్రాక్టీస్​ శిబిరంలో చేర్చుకుంది. త్రో డౌన్‌‌ స్పెషలిస్ట్‌‌  ప్రీతేష్​ జోషి.. పిథియా విషయాన్ని ఆసీస్​ అసిస్టెంట్​ కోచ్​ ఆండ్రీ బోరోవెక్​ దృష్టికి తీసుకెళ్లాడు. హైదరాబాద్​ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ ఆడిన శశాంక్​ మల్హోత్రా కూడా ఆసీస్​ నెట్ బౌలర్‌‌గా వ్యవహరిస్తున్నాడు. త్రో డౌన్​ స్పెషలిస్ట్​ ఖలీల్​ షరీఫ్​ బౌలింగ్​లో కూడా ఆసీస్​ బ్యాటర్లు  తమ నైపుణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.