కరోనా అప్‌డేట్స్‌తో టెక్ కంపెనీలు

కరోనా అప్‌డేట్స్‌తో టెక్ కంపెనీలు

టెక్​ కంపెనీల ఇమేజ్​ మారింది..

కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టెక్ కంపెనీలన్ని అనూహ్యమైన రీతిలో స్పందిస్తున్నాయి. ఎప్పడికప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడమే కాకుండా, తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కరోనా వ్యాప్తికి ముందు టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే దొంగలుగా అప్పటిదాకా ముద్రపడిన ఈ టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయి. ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విటర్ లాంటి సంస్థలు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పడికప్పుడూ ప్రజలకు చేరవేస్తున్నాయి. గూగుల్ కూడా ఇదే బాటలో నడుస్తూ ఉంది. కరోనా వైరస్ బారి నుంచి ప్రజలు బయటపడేందుకు లక్షల కొద్దీ డాలర్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీఫ్ సాయం కింద ప్రకటిస్తున్నాయి. అంతేకాక పెద్ద మొత్తంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌9 మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను అందిస్తున్నాయి. ఈ వైరస్ వల్ల ఉపాధి భారీగా కోల్పోయి, నిరుద్యోగం ప్రబలుతుండటంతో… చిన్న సంస్థలకు ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ సాయం చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ డాలర్ల ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇది ప్రకటించింది. అమెజాన్ కూడా కొత్తగా లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం టెక్ కంపెనీలే మన జీవన విధానాల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయని కొందరు నిపుణులంటున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని, ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావొద్దని ఆదేశాలుండటంతో… ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు, కొన్ని రకాల సేవల  కోసం  ఇప్పుడు ప్రజలు ఎక్కువగా టెక్ మాధ్యమాలపైనే ఆధారపడుతన్నారు.

కరోనా టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గూగుల్ కూడా ఒక ముఖ్యమైన హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. అమెజాన్ అయితే ప్రజలకు అవసరమైన అన్ని రకాల ఫుడ్ సప్లయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేపడుతోంది. అమెజాన్, ఆల్ఫాబెట్, యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలంటరీర్లు రేయింబవళ్లు స్పందిస్తూ వైరస్ వ్యాప్తిను ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ట్విటర్, టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పార్టనర్ అయి.. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి. అమెరికాలోని అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా కూడా పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకోవడం కోసం లక్ష మందిని నియమించుకుంటానని అమెజాన్ చెప్పింది. అంతేకాక వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకొత్త రకం పాలసీలను తీసుకొచ్చింది. ఎప్పడికప్పుడు డోర్లను క్లీన్ చేయడం, టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం వంటి వాటిని వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకొచ్చింది. సోషల్ డిస్టెన్సింగ్ ఉండేలా చేస్తోంది. తన ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్ల కోసం లక్షల కొద్దీ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను ఆర్డర్ చేసింది. అంతకుముందు కంటే సమర్థవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. ప్రజలు ఎక్కువగా తమకు కావాల్సిన వస్తువులను స్టోర్లకు వెళ్లి కొనుక్కోకుండా.. ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనాలని ప్రమోట్ చేస్తోంది. అమెజాన్ ఎకో లాంటి డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను షిప్ చేస్తోంది. అయితే అవసరం లేని వస్తువుల డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెజాన్ తక్కువగా చేపడుతోంది.

For More News..

కరోనాపై పోరుకు సచిన్‌‌ రూ.50 లక్షల విరాళం

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి