రాష్ట్రంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన హైకోర్టు జూనియర్ ఎగ్జామ్ లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ మల్లాపూర్ లోని ఐయాన్ డిజిటల్ లో గందరగోళం తలెత్తింది. సాయంత్రం 4:45 నిమిషాలకు మొదలైన ఎగ్జామ్ లో.. దాదాపు ఐదుగురి కంప్యూటర్స్ ఓపెన్ కాలేదు. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కంప్యూటర్లు ఓపెన్ కాలేదనినీ ఎగ్జామ్ సెంటర్ అధికారులు తెలిపారు. దీంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, ఈ విషయంపై ఎగ్జామ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పూర్తి అభ్యర్థులను అసహనానికి గురిచేసింది. అధికారులు ఆ ఐదుగురి అభ్యర్థులకు టైమ్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించో లేక ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకోకుండా... అభ్యర్థులందరినీ 2.30 గంటల పాటు ఎగ్జామ్ హాల్లో ఉంచారు. ఎగ్జామ్ సెంటర్ గేట్లకు తాళం వేసి నిర్భంధించారు.
ఈ సమస్యవల్ల ఎవరికీ ఎగ్జామ్ నిర్వహించకపోయినా.. అభ్యర్థులందరినీ రెండున్నర గంటల పాటు ఎందుకు నిర్భంధించారో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో అభ్యర్థులంతా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి వచ్చి సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అభ్యర్థుల ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
