ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : తేజస్ నందలాల్ పవార్

ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు:  గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని ఆఫీర్లను కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్  సూచించారు.  మంగళవారం కలెక్టరేట్​లో స్పెషల్ సమ్మరి రివిజన్ –2024 పై  తహశీల్దార్లు, డీటీలు, బీఎల్ ఓలు,  సూపర్ వైజర్లతో ఓటరు జాబితా తయారుపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించాలని ఆదేశించారు.  అవసరమైన చోట కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలుపంపాలన్నారు. జనవరి 6 న ముసాయిదా జాబితా ప్రచురించాలని, 6 నుంచి జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2 వరకు అన్ని ఫిర్యాదులు పరిష్కరించి ఫిబ్రవరి6న తుది జాబితాను  ప్రచురణ కోసం కమిషన్ కు పంపించాలన్నారు. 2024 ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితా ప్రకటిస్తారన్నారు. సమావేవంలో  అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు పాల్గొన్నారు.