రైతుల కోసం ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధం

రైతుల కోసం ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజశ్వీ యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. రైతుల కోసం తాను ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమని ఆయన అన్నారు. తేజశ్వీ యాదవ్ రైతుల బంద్‌కు మద్దతు తెలపడంతో ఆయనను అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆయన నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనావైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో అనుమతి లేకుండా నిరసన వ్యక్తం చేసినందుకు యాదవ్‌తో పాటు మరో 18 మంది నాయకులపై కేసు నమోదైంది. బీహార్‌లో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గ్రాండ్ అలయన్స్‌ని ఏర్పాటు చేశాయి.

‘పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం రైతులకు మద్దతు తెలిపినందుకు మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిజంగా మీకు దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయండి లేకపోతే నాకు నేనే లొంగిపోతాను. రైతుల కోసం నేను ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అని ప్రతిపక్ష నాయకుడు తేజశ్వీ యాదవ్ ట్వీట్ చేశారు.

గత పది రోజులుగా రైతులు కఠినమైన చలిలో అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సామరస్యంగా నిరసన తెలుపుతున్నారు.

For More News..

హయ్యెస్ట్​ మెజార్టీ 18,909.. అత్యల్ప మెజార్టీ 32 ఓట్లు

అగ్రి చట్టాలను రద్దు చేస్తరా.. లేదా? ఎస్ ఆర్ నో

డాక్యుమెంట్లులేని విదేశీయులను దేశం నుంచి వెళ్లగొట్టొద్దు