తేజస్విన్ శంకర్‌కు కాంస్యం

తేజస్విన్ శంకర్‌కు కాంస్యం

కామన్ వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా హై జంప్ కేటగిరీలో భారత్ కు పతకం వచ్చింది. 23 ఏళ్ల తేజస్విన్ శంకర్ ఈ విభాగంలో కాంస్య పతకం సాధించారు. 2.22 మీటర్ల దూరం ఆయన హై జంప్ చేశారు. ఇదే పోటీలో న్యూజిలాండ్ కు చెందిన హామిష్ కెర్ 2.25 మీటర్ల దూరం హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని సాధించారు.

ఆస్ట్రేలియాకు చెందిన బ్రాండన్ స్టార్క్ ను రజత పతకం వరించింది. ఈ పోటీలో తొలి ప్రయత్నంలో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల దూరం హై జంప్ చేయగా, రెండో ప్రయత్నంలో 2.25 మీటర్ల దూరం దూకడంలో విఫలమయ్యారు. అయితే చివరిదైన మూడో ప్రయత్నంలో 2.28 మీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. దీంతో మూడో స్థానానికి (కాంస్యానికి) తేజస్విన్ శంకర్  పరిమితం అయ్యారు.