న్యూఢిల్లీ : తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫికేషన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతనితో పాటు దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు ఇటలీలోని బస్టో అర్సిజియోలో జరిగే టోర్నీలో పోటీపడనున్నారు. ఈ మేరకు మెన్స్‌లో ఏడుగురు, విమెన్స్‌లో ఇద్దరితో కూడిన టీమ్‌ను బీఎఫ్‌ఐ సోమవారం ప్రకటించింది.
మెన్స్: హుస్సామ్ (57 కేజీ), దీపక్ (51 కేజీ), నిశాంత్ (71 కేజీ) శివ థాపా (63.5 కేజీ), లక్ష్య చహర్ (80 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేందర్ (+92 కేజీ); విమెన్స్: జాస్మిన్ (60 కేజీ), అంకుష్ట బోరో (66 కేజీ).
