కొత్త పార్టీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కొత్త పార్టీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తాను పుట్టగానే సీఎం అవుతానని తన తల్లిదండ్రులు అనుకున్నారా అంటూ మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదరణ ఉంటే ఎవరైనా సీఎం కావొచ్చన్నారు. ఎందరో మామూలు వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అయ్యారన్నారు. పలువురు సినీ నటులు సైతం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ సీఎం అవ్వలేదా అంటూ కేసీఆర్ ప్రవ్నించారు. రాజకీయాల్లో గర్వం, అహంకారం  పనికిరాదన్నారు కేసీఆర్. నిందలు వేయడం సరికాదన్నారు. పాలసీలను విమర్శించాల్నారు. ఇక కొత్త పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. దేశం కోసం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరకుంటే పెడతా అన్నారు. దేశం కొత్త మార్గం పట్టాల్సిందే అన్నారు. కొత్త ఆలోచన కొత్త దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. కులమత జాతి భేధాలు పక్కన పెట్టి ప్రజలంతా పిడికిలి ఎత్తి ముందుకు కదలాల్సిందే అన్నారు కేసీఆర్. అప్పుడు ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుందన్నారు. 

తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నాని కేసీఆర్ తెలిపారు. ‘ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ.. థింగ్స్ విల్ హ్యాపన్’ అన్నారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. ప్రజా తీర్పును గౌరవించిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు కేసీఆర్. బీజేపీ ప్రభుత్వంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందన్నారు కేసీఆర్. గెలవకుండానే కర్నాటక,మధ్యప్రదేశ్,మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. 

ఇవి కూడా చదవండి: 

బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుంది

బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా