అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో  తెలంగాణ  రైతు ఆత్మహత్య

కొండమల్లేపల్లి, వెలుగు :  అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన  నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తబావికి చెందిన మామిళ్ల సాలయ్య(45) అనే రైతు తన7ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఈ ఏడాది కూడా పత్తి పంట వేసేందుకు, బిడ్డ పెండ్లి కోసం  వేరువేరు చోట్ల సుమారు రూ.14 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంట దిగుబడి చాలా తగ్గింది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పును ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన సాలయ్య.. మంగళవారం ఉదయం 7:30 గంటలకు తన పొలంలోని రేకుల షెడ్డుకు ఉరివేసుకుని చనిపోయాడు.