గుడ్ న్యూస్: రూ. 50వేల వరకు ఫ్రీ లోన్స్.. త్వరగా అప్లై చేసుకోండి..

గుడ్ న్యూస్: రూ. 50వేల వరకు ఫ్రీ లోన్స్.. త్వరగా అప్లై చేసుకోండి..
  • రూ.50 వేల వరకు లోన్లకు 100% సబ్సిడీ.. ‘రాజీవ్​ యువ వికాసం’  స్కీమ్​ గైడ్​లైన్స్​ రిలీజ్​
  • లక్ష వరకు 90%, 2 లక్షల వరకు 80 %, 4 లక్షల వరకు 70%..
  • అమరుల, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి ఫ్యామిలీస్​కు ప్రాధాన్యం
  • 5 లక్షల యూనిట్లలో 25 శాతం ఉమెన్స్​కు.. అందులో ఒంటరి, వితంతు మహిళలకు ప్రయారిటీ

హైదరాబాద్​, వెలుగు : ‘రాజీవ్​యువ వికాసం’ స్కీమ్ కింద రూ.50 వేల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు సర్కారు 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. రూ. లక్ష వరకు  90%, రూ. 2 లక్షల వరకు 80%,  రూ. 4 లక్షల  వరకు 70% సబ్సిడీపై లోన్లు అందజేయనున్నది. ‘రాజీవ్ యువ వికాసం’ స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.  రూ. 50 వేల వరకు లోన్లు పొందిన లబ్ధిదారులు బ్యాంకులకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఆ మొత్తాన్ని సర్కారే తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన యూనిట్లకు సంబంధించి లక్ష రూపాయల వరకు  10%, 2 లక్షల వరకు 20% ,  రూ. 4 లక్షల  వరకు 30%  బ్యాలెన్స్​అమౌంట్​ను  మాత్రమే   లబ్ధిదారులు  బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.  నిరుద్యోగ యువతపై ఆర్థిక భారం లేకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది.    

5 లక్షల మందికి లబ్ధి..

‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్​ద్వారా రాష్ట్ర  ప్రభుత్వం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్​ యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నది. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించింది. స్కీమ్​ గైడ్​లైన్స్​ ప్రకారం.. ఐదేండ్ల వ్యవధిలో  ఒక్కో కుటుంబం  ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి.  పట్టణాల్లో రూ. 2 లక్షలు, పల్లెల్లో రూ. 1.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలే  ఈ స్కీమ్​కు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఒకవేళ రేషన్​కార్డు లేకపోతే ఇన్​కం సర్టిఫికెట్​ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు (సదరం సర్టిఫికెట్ తప్పనిసరి) 5% రిజర్వేషన్ అమలవుతుంది. దీనికి తోడు తెలంగాణ అమరవీరుల  కుటుంబాలకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు, స్వయం ఉపాధిలో స్కిల్స్ ఉన్న యువతకు ప్రాధాన్యత ఉంటుందని గైడ్​లైన్స్​లో స్పష్టంచేశారు.  

దరఖాస్తులు ఆన్‌‌లైన్‌‌లో మాత్రమే స్వీకరిస్తామని, అధికారిక పోర్టల్‌‌లో (tgobmms.cgg.gov.in) అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను మండల, జిల్లాస్థాయి కమిటీలు పరిశీలించి  మార్గదర్శకాలకు తగ్గట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని వెల్లడించారు. కాగా, మండల స్థాయిలో ఎంపీడీవో/మున్సిపల్/జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీలు,. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయి.

అప్లికేషన్​కు  జత చేయాల్సినవి ఇవే

ఈ స్కీమ్​ కింద లబ్ధి పొందాలనుకుంటే రేషన్​ కార్డు తప్పనిసరి నిబంధనగా ప్రభుత్వం పేర్కొన్నా, అవి లేనివారు వార్షికాదాయాన్ని ధృవీకరించే సర్టిఫికెట్‌‌ను జతపర్చాల్సి ఉంటుందని ప్రభుత్వం​ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్​ (ట్రాన్స్​పోర్ట్​ వెహికల్స్​ కోసం దరఖాస్తు చేసుకుంటే), కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన), పట్టాదారు పాస్‌‌బుక్ (వ్యవసాయ అవసరాలకు దరఖాస్తు చేసుకుంటే), ‘సదరం’ సర్టిఫికెట్ (దివ్యాంగ దరఖాస్తుదారులకు), పాస్‌‌పోర్ట్​సైజ్​ ఫొటో అప్లికేషన్‌‌తో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

ఆన్‌‌లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత.. దాన్ని డౌన్‌‌లోడ్ చేసుకుని సమీపంలోని ఎంపీడీవో (గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు) లేదా మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషనర్‌‌కు ఫిజికల్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో ప్రజాపాలన కేంద్రాల్లో ఈ స్కీమ్‌‌పై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్టు సర్కారు తెలిపింది.