503 పోస్టులతో గ్రూప్​ 1 నోటిఫికేషన్ రిలీజ్

503 పోస్టులతో గ్రూప్​ 1 నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. టీఎస్పీఎస్పీ మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్పీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 2 నుంచి మే 31 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. 2018నాటి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. 

గ్రూప్ 1 పరీక్షను ప్రిలిమినరీ (ఆబ్జెక్టివ్ టైప్), మెయిన్స్ (రాత పరీక్ష) విధానంలో నిర్వహించనున్నారు. పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలు రద్దు చేసి కేవలం అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని 33జిల్లాల్లో జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహించి నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని టీఎస్పీఎస్పీ భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్షను ఇంగ్లీష్, తెలుగుతో పాటు తొలిసారి ఉర్దూలో నిర్వహించనున్నారు.

కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్..2018 దృష్ట్యా..స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్‌తో పోస్టుల భర్తీ చేపట్టారు. మే 2వ తేదీ నుండి మే 31 వరకు అన్ లైన్ ద్వార దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది.
రెండు విధాలుగా పరీక్ష
గ్రూప్ 1 పరీక్ష రెండు విధాలుగా ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)   మెయిన్స్ (వ్రాత పరీక్ష) జరుగుతుంది.

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) జూలై లేదా ఆగస్టు లో నిర్వహించనున్నారు. 

అలాగే నవంబర్ లేదా డిసెంబర్  లో మెయిన్స్  పరీక్ష జరుగుతుంది.

గ్రూప్-I నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా TSPSC OTRలో నమోదు చేసుకోవాలి.

లేదా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగా వారి OTRని అప్‌డేట్ చేయాలి.

గ్రూప్-1 సర్వీసెస్‌లో మొదటిసారిగా EWS మరియు స్పోర్ట్స్ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 

 

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం

మానవత్వం చాటిన బెంజ్ కార్ ఓనర్

కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్

మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్

6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్