
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్టీల లీడర్లు, ప్రభుత్వ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు ఆయా ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకర్రెడ్డి, ఆదిలాబాద్లో విప్ గంప గోవర్ధన్, ఆసిఫాబాద్ ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, మంచిర్యాలలో బాల్క సుమన్ పాల్గొన్నారు. అలాగే ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్టీ శ్రేణులు వేడుకలు జరిపారు.
నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామనాథ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజా సంక్షేమం ,అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ లీడర్లు అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింది. తెలంగాణ అభివృద్ధిని దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి చేరిందని , పారదర్శకమైన పరిపాలనతో మన్ననలు పొందుతుందని చెప్పారు. అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు అధికారులు, నాయకలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- వెలుగు, నెట్ వర్క్