హాఫ్‌‌‌‌ మారథాన్‌‌‌‌ విన్నర్‌‌‌‌ రమేశ్‌‌‌‌

హాఫ్‌‌‌‌ మారథాన్‌‌‌‌ విన్నర్‌‌‌‌ రమేశ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ : హైదరాబాద్‌‌‌‌ హాఫ్‌‌‌‌ మారథాన్‌‌‌‌లో తెలంగాణ రన్నర్‌‌‌‌ బి. రమేశ్‌‌‌‌ చంద్ర చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పోటీల్లో మెన్స్‌‌‌‌ 21.1 కిలోమీటర్ల రేస్‌‌‌‌లో రమేశ్‌‌‌‌ చంద్ర 1:13;10 సెకన్లలో లక్ష్యాన్ని చేరి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. సతీష్‌‌‌‌ కుమార్‌‌‌‌ (1:15;50 సెకన్లు), పీయూష్‌‌‌‌ మసానె (1:16;56 సెకన్లు) వరుసగా సెకండ్‌‌‌‌, థర్డ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో ప్రజక్తా గాడ్బోలే (1:23;45 సెకన్లు), ప్రీనూ యాదవ్‌‌‌‌ (1:24;46 సెకన్లు), తేజస్విని ఉంబ్కానె (1:25;11 సెకన్లు) టాప్‌‌‌‌-–3లో నిలిచారు. మెన్స్‌‌‌‌ 10 కిలోమీటర్లలో చేతన్‌‌‌‌ కుమార్‌‌‌‌ (34ని.21సె), భరత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (35ని.13సె), నిఖిల్‌‌‌‌ ఎరిగిలా (35ని.24సె), విమెన్స్‌‌‌‌లో శీలూ యాదవ్‌‌‌‌ (41ని.34సె), ముస్కాన్‌‌‌‌ (48ని.29సె), యాంకే దుప్కా (50ని.04సె) విజేతలుగా నిలిచారు.

మారథాన్‌‌‌‌ విన్నర్లను క్రికెట్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ అభినందించాడు. ‘హైదరాబాద్‌‌‌‌ హాఫ్‌‌‌‌ మారథాన్‌‌‌‌ అద్భుతంగా ఉంది. వ్యక్తిగతంగా విజువల్లీ చాలెంజ్డ్‌‌‌‌ రన్నర్ల ధైర్యాన్ని చూసి కదిలిపోయాను. వాళ్లందరూ మనకు స్ఫూర్తి. మన ప్లానెట్‌‌‌‌ను, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ప్రధానం. మారథాన్‌‌‌‌లో పాల్గొన్న వారందరి తరఫున మేం 10 వేల చెట్లను నాటడం మా కార్యక్రమంలో ఓ భాగం’ అని సచిన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశాడు. నేషనల్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ కోచ్‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.