వచ్చేయండి.. తెలంగాణలో రేపట్నుంచి స్కూళ్లు రీ ఓపెన్

 వచ్చేయండి.. తెలంగాణలో రేపట్నుంచి స్కూళ్లు రీ ఓపెన్

తెలంగాణలో సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.   జనవరి 12 నుండి 17 వరకు ఆరు రోజుల పాటు  పాఠశాలలకు  సంక్రాంతి సెలవులుగా విద్యా శాఖ ప్రకటించింది. 

ఇక రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి  పునఃప్రారంభం కానున్నాయి.  జూనియర్ కాలేజీలకు జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది విద్యాశాఖ. దీంతో పండగ కోసం సొంతూరుకు వెళ్లిన వారు పట్నం బాట పట్టారు.   

మరోవైపు ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. కాలేజీలకు ఇవాళ్టితో సెలవులు  ముగుస్తాయి.  ఏపీలో అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ మొత్తం పది రోజులు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.