బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ కు గోల్డ్‌ మెడల్‌

V6 Velugu Posted on Oct 28, 2021

తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్‌ ఫైనల్లో 4-1తో హర్యానకు చెందిన మీనాక్షి పై విజయం సాధించింది. అంతేకాదు.. నిఖత్‌కు టోర్నీ 'బెస్ట్‌ బాక్సర్‌' అవార్డు లభించింది.

మరోవైపు తెలంగాణకు చెందిన బాక్సర్ గోనెళ్ల నిహారిక  66 కేజీల విభాగంలో  కాంస్య పతకం సాధించింది. దీంతో పాటు జాతీయ శిక్షణ శిబిరంలో స్థానం సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా బొర్గోహైన్‌కు నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు ఇచ్చారు.

Tagged Telangana, Nikhat Zareen, clinches gold, National Boxing championship

Latest Videos

Subscribe Now

More News