మినరల్​ వాటర్​ టేస్ట్​ ఎలా ఉంటదో చెప్తుండు

మినరల్​ వాటర్​ టేస్ట్​ ఎలా ఉంటదో చెప్తుండు

కొందరు ఫుడీస్​... టేస్ట్​ చూసి ఫుడ్​​ బాగుందో?  లేదో?  చెప్పేస్తారు. అలానే వైన్​, కాఫీ టీ టేస్టర్స్​ వాటి రుచి చెబుతారు. వాళ్లు ‘టేస్ట్​ బాగుంది’ అంటే చాలు... మార్కెట్​లో ఆ బ్రాండ్​కి గిరాకీ పెరుగుతుంది. ముంబైలో ఉంటున్న గణేశ్​ అయ్యర్ కూడా అచ్చం అదే పని చేస్తాడు. కాకపోతే ఇతను మినరల్​ వాటర్​ టేస్ట్​ ఎలా ఉందో చెప్తుంటాడు. ఈయనొక ‘వాటర్​ సొమెలియె’. మనదేశంలో వాటర్​ సొమెలియె  సర్టిఫికెట్​ ఉన్న మొదటి వ్యక్తి  ఈయనే. 

నేచురల్​ మినరల్​ వాటర్​..... ఈ నీళ్లు ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఊటలు, చెలిమెలు, కాల్వల్లో దొరుకుతాయి. ఈ నీళ్లు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచివి. అందుకే ఈ నీళ్ల బాటిల్​ ధర ఎక్కువైనా కొనుక్కుని తాగుతారు చాలామంది. అయితే, అన్ని మినరల్ వాటర్స్​ రుచి ఒకేలా ఉండదు. టేస్ట్​ని బట్టి నేచురల్​ మినరల్​ వాటర్స్​లోని​ రకాల్ని గుర్తిస్తాడు గణేశ్​. ఆ నీళ్లలోని మినరల్​ కంటెంట్​, టేస్ట్​, ఎక్కడ దొరుకుతాయి? అనేదాన్ని బట్టి వాటి రుచి చెప్పేస్తాడు. నెలకి రెండు లక్షల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఇతర దేశాల్లో ఇప్పటి వరకూ ఏడు రకాల నీళ్లని రుచి చూశాడు గణేశ్​. వాటిలో 120 నేచురల్​ మినరల్స్​, స్పార్క్​లింగ్​ మినరల్​ వాటర్​ బ్రాండ్లు ఉన్నాయి. 


వాటర్​ సొమెలియె ఎలా అయ్యాడంటే..
బెవరేజ్​ ఇండస్ట్రీలో వైన్​ సొమెలియెగా చాలా ఏండ్లు పనిచేశాడు గణేశ్​. ఆయన టేస్ట్​ చేసి, ‘ఓకే’ చెప్పిన బెవరేజ్​ బ్రాండ్స్​ మార్కెట్​లో చాలా ఉన్నాయి. అప్పటికే  వైన్​ సొమెలియేలు చాలామంది ఉన్నారు. అయితే, 2000 సంవత్సరం మొదట్లో మినరల్​ వాటర్​ బ్రాండ్స్ పుట్టుకొచ్చాయి. దాంతో ఆయా కంపెనీలకి మినరల్​ వాటర్​ రుచి చూసి, ఎలా ఉందో? చెప్పగలిగే క్వాలిఫైడ్​ వాటర్​ సొమెలియె కావాల్సి వచ్చింది. దాంతో,  సర్టిఫైడ్​ వాటర్ సోమెలియె అవ్వాలి అనుకున్నాడు గణేశ్. వాటర్​ సొమెలియె కోర్స్ చేశాడు. అప్పట్లో మనదేశంలో రెండు రకాల మినరల్​ వాటర్​ బ్రాండ్స్​ ఉండేవి. ఇప్పుడు దాదాపు తొమ్మిది మినరల్​ వాటర్​ బ్రాండ్స్​ ఉన్నాయి. 


ఇంతకీ వీళ్లు ఏం చేస్తారంటే...
నేచురల్​ మినరల్​ వాటర్​లో  ఏమేం మినరల్స్​ ఉన్నాయి? ఆ నీళ్ల కఠినత్వం?,  ఆ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? వాటిలో కార్బన్​–డై–ఆక్సైడ్ ఎంత ఉంది? ఇంకా ఏమేం ఉన్నాయి? ​వంటి విషయాల ఆధారంగా మినరల్​ వాటర్స్​లోని రకాల్ని గుర్తిస్తారు వాటర్​ సొమెలియేలు. అంతేకాదు ఆ నీళ్లని ఏయే వంటకాల్లో  వాడాలి? ఏ వైన్​లో కలపాలి? అనేది  చెప్తారు కూడా. వాటర్​ సొమెలియె కోర్స్ అందిస్తున్న సంస్థలు ప్రపంచవ్యాప్తంగా రెండో మూడో ఉన్నాయంతే. అవి కూడా ఆన్​లైన్​ కోర్సులు ఆఫర్​ చేస్తున్నాయి. వాటర్​ సోమెలియె సర్టిఫికెట్​ ఇచ్చే సంస్థల్లో  జర్మనీలోని మ్యునిక్​​లో ఉన్న ‘డొమెన్స్​ అకాడమీ’ చాలా పాతది. మనదేశంలో  ప్యాకేజ్డ్​​ డ్రింకింగ్​వాటర్​, నేచురల్​ మినరల్​ వాటర్​ అమ్ముతారు. బ్యూరో ఆఫ్​ ఇండియా స్టాండర్డ్స్​ (బిఎస్​ఐ), ఫుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్​ఎస్ఎస్​ఎఐ) అప్రూవల్​ ఉంది వీటికి.