హర్యానా స్టీలర్స్‌‌ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్‌‌

హర్యానా స్టీలర్స్‌‌ చేతిలో ఓడిన తెలుగు టైటాన్స్‌‌

హైదరాబాద్‌ ‌:  ప్రొ కబడ్డీ లీగ్‌‌ (పీకేఎల్‌‌)లో తెలుగు టైటాన్స్‌‌ మళ్లీ ఓడింది. సోమవారం జరిగిన 15వ లీగ్‌‌ మ్యాచ్‌‌లో టైటాన్స్‌‌30–37 తేడాతో హర్యానా స్టీలర్స్‌‌ చేతిలో ఓడింది. టైటాన్స్‌‌ టీమ్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌ సంజీవి (6),  రైడర్‌‌ పవన్‌‌ షెరావత్‌‌ (3), డిఫెండర్‌‌ అజిత్‌‌ (3)తో సహా అందరూ ఫెయిలయ్యారు.

రాహుల్‌‌ సెత్పాల్‌‌ (8), వినయ్‌‌ (6), మోహిత్‌‌ (6), గన్‌‌శ్యామ్‌‌ (4) హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్‌‌గా ఇప్పటి వరకు టోర్నీలో టైటాన్స్‌‌ రెండు మ్యాచ్‌‌లు మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌‌లో జైపూర్‌‌ పింక్‌‌ పాంథర్స్‌‌ 42-–25తో బెంగాల్‌‌ వారియర్స్‌‌పై గెలిచింది. జైపూర్‌‌ రైడర్‌‌ అర్జున్‌‌ దేశ్వాల్‌‌ (15), భవానీ రాజ్‌‌పుత్‌‌ (7), అంకుష్‌‌ (6) రాణించారు. బెంగాల్‌‌ టీమ్‌‌లో మణిందర్‌‌ సింగ్‌‌ (9), వైభవ్‌‌ (5) మాత్రమే ఆడారు.